థరూర్: వివాదాల పుట్ట

పైవ్ స్టార్ హోటల్లో నివాసం ఉండడం దగ్గర్నుంచి పలు వివాదాలు చుట్టుముట్టినా ప్రధాని మన్మోహన్ సింగ్ వెనకేసుకు రావడం పరిపాటిగా మారింది. ఆయన పట్ల పార్టీ, ప్రభుత్వం ఉదారంగానే వ్యవహరిస్తూ వచ్చాయి. థరూర్ అధికారిక నివాసంలో ఉండడానికి బదులు ఫైవ్ స్టార్ హోటల్లో కాపురం పెట్టడం తొలుత వివాదంగా మారింది. ప్రభుత్వం ఆమ్ ఆద్మీ అంటూ పేదల తరఫున నిలవడతామని ప్రకటిస్తుంటే ఆయన ఫైవ్ స్టార్ హోటల్లో ఉండడం వివాదంగా మారింది. పొదుపు చర్యల్లో భాగంగా ఫైవ్ స్టార్ హోటల్ ను ఖాళీ చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆయనను ఆదేశించారు. అధికారిక నివాసం అందుబాటులో లేకపోవడంతో హోటల్లో ఉంటున్నట్లు థరూర్ తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. పైగా అధికారిక నివాసంలో జిమ్ సౌకర్యం లేదంటూ ఫిర్యాదు చేశారు.
పొదుపు చర్యల్లో భాగంగా లగ్జరీ క్లాసులో ప్రయాణించకూడదని నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. పొదుపు ప్రయాణాన్ని ఆయన క్యాటిల్ క్లాస్ గా అభివర్ణించి వివాదంలో చిక్కుకున్నారు. అయితే థరూర్ వ్యాఖ్యను సీరియస్ గా తీసుకోవద్దని, అది ఆషామాషీగా చేసిన వ్యాఖ్య అని ప్రధాని మన్మోహన్ సింగ్ వెనకేసుకొచ్చారు. పార్టీ కార్యక్రమాలను కూడా ఆయన విమర్శిస్తూ వచ్చారు. గాంధీ జయంతి రోజు సెలవు తీసుకోకుండా పని చేయడమే గాంధీనికి నిజమైన నివాళి అంటూ మరోసారి పార్టీకి, ప్రభుత్వానికి ఆయన తలనొప్పి తెచ్చి పెట్టారు. నెహ్రూ విదేశాంగ విధానాన్ని తప్పు పట్టారు. ప్రభుత్వ విధానాలపై బహిరంగ వ్యాఖ్యలు చే్స్తూ వచ్చారు. ఇన్ని తలనొప్పులు తెచ్చి పెట్టినప్పటికీ ఆయనను ప్రభుత్వం, పార్టీ క్షమిస్తూ వచ్చింది. ఐపియల్ వివాదం తారాస్థాయికి చేరి, ప్రతిపక్షాలు పార్లమెంటును నడవనివ్వ స్థాయికి చేరుకోవడంతో థరూర్ కు ఉద్వాసన చెప్పక తప్పలేదు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications