తెలంగాణ యుద్ధభూమి?

తెలంగాణలోని పది జిల్లాల అబిమాన సంఘాలతో కలిసి చిరు ఫోర్స్ ఏర్పడడం, చంద్రబాబు చంద్ర దళాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణలో ఘర్షణలు, దాడులు ఎదురుదాడులు తప్పకపోవచ్చుననే వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. తమ అభిమాన నటుడి కుటుంబానికి చెందిన నటుల సినిమాలను అడ్డుకుంటే ప్రాణాలు తీస్తామని చిరు ఫోర్స్ నాయకులు హెచ్చరించారు. చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమాలను అడ్డుకునే తెలంగాణవాదులపై దాడులు చేసేందుకు చిరు ఫోర్స్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వారి హెచ్చరికలు తెలియజేస్తున్నాయి. అలాగే, చంద్ర దళం కూడా తెలంగాణవాదులపై దాడులకు పురికొల్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటుందనే విషయం తెలిసిపోతూనే ఉన్నది.
చంద్రబాబు, చిరంజీవి, వైయస్ జగన్ వంటి నాయకులు తెలంగాణలోని తమ అనుచరులతో తెలంగాణవాదులపై పురికొల్పేందుకు సమాయత్తమవుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎలా ఉన్నా, కేంద్ర నిర్ణయం ఎలా ఉన్నా తెలంగాణ అగ్నిగుండం కాక తప్పదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువడినా సీమాంధ్ర నాయకులు తీవ్ర పరిణామాలకు దారి తీసే చర్యలకు పాల్పడుతారేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ భయాందోళనలు వీడే పరిస్థితి లేదు.












Click it and Unblock the Notifications