పులిపై ఎందుకు వ్యతిరేకత?

పైగా, ప్రజారాజ్యం పుట్టినప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణపై అమితమైన ప్రేమను కురిపించారు. తెలంగాణలో పర్యటించారు. కల్లు తాగారు, చిందులేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో సంభవించిన పరిణామాలతో, ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ వైఫల్యంతో ఆయన పూర్తిగా రాజకీయాల ఊసు మానేశారు. అన్నయ్యను ముఖ్యమంత్రి చేయాలని ఆయన కలలు కన్నారు. తెలంగాణను ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి పవన్ కళ్యాణ్ ఆ ప్రేమను కురిపించాడనేది దాన్ని బట్టి అర్థమవుతోంది. రాజకీయాల మాట అటుంచితే ఇప్పుడు పులి సినిమా పేరును కొమరం పులిగా మార్చేసి తెలంగాణ ప్రజలను మాయ చేసేందుకు పూనుకున్నారు. కొమురం భీంను స్ఫురించజేస్తూ ఆ పేరును మార్చి డబ్బులు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
సినిమాలకు, రాజకీయాలకు సంబంధం లేదని సీమాంధ్ర నాయకులు అంటున్నారు. రాజకీయాలతో సంబంధం లేకపోతే, సినీ ప్రముఖులు ఏదో రాజకీయ పార్టీలో ఎందుకున్నారనేది ప్రశ్న. పైగా, రాష్ట్ర విభజన సమస్య తలెత్తినప్పుడు సమైక్య నినాదాన్ని ఎందుకు ఎత్తుకుంటున్నారనేది మరో ప్రశ్న. తెలుగు చలన చిత్రాలను కళగా చెప్పుకునే పరిస్థితిగానీ, తెలుగు సినిమావాళ్లను కళాకారులు అని పిలిచే పరిస్థితి గానీ లేదు. సినిమా రంగం పూర్తిగా వ్యాపారమై పోయింది. సినీ రంగాన్ని పూర్తి వ్యాపారమయంగా మార్చిన వారిలో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సినిమాను అడ్డుకుంటామంటే ఒక కళాకారుడిగా, ఒక వ్యక్తిగా తమ తరఫున పవన్ కళ్యాణ్ మాట్లాడుతారని అభిమానులు ఆశ పడడంలో తప్పు లేదు. తెలంగాణ ప్రజల మనోభావాలను పవన్ కళ్యాణ్ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.












Click it and Unblock the Notifications