జగన్ పార్టీ పెడతారా?

అంతేకాకుండా జగన్ గొంతుక అయిన అంబటి రాంబాబు సైతం నిన్నటి వరకు జగన్ కొత్త పార్టీ పెట్టడం లేదని ఖచ్చితంగా చెప్పేవాడు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాత్రి కూడా జగన్ ఆయన అనుచరులతో భేటీ ఆయ్యారు. ఆ రోజు సైతం అంబటి కొత్త పార్టీ అనేది మీడియా రాద్దాంతమేనని పార్టీ విషయమే లేదన్నారు. అయితే ఆదివారం మాత్రం అంబటి వ్యాఖ్యలు కొత్త పార్టీ దిశలో కనిపించాయి. పార్టీలో జగన్ కు సముచిత స్థానం ఇవ్వాలని ఆయన ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. అయితే లేదంటే జగన్ కొత్త పార్టీ పెడతారా అని అడిగితే సందర్భం వచ్చినప్పుడు చూద్దామని దాట వేశారు.
తన కుటుంబ సభ్యులనే పదవుల ఎరతో అధిష్టానం కూడా తనకు దూరం చేయడాన్ని జగన్ జీర్ణించుకోలేక పోతున్నట్టు సమాచారం. తన వర్గం వారిని పక్కన పెట్టేందుకు అధిష్టానం కసరత్తు చేస్తున్నదని ఆయన భావిస్తున్నారు. ఇప్పటి వరకు అధిష్టానాన్ని రెచ్చగొట్టి గెంటివేయించుకుందామనుకున్న జగన్ ను నిరాశకు గురిచేస్తుంది. ఆయన ఎత్తులకు అధిష్టానం పై ఎత్తులు వేస్తూ తనంత తానే బయటకు వెళ్లేలా ప్రయత్నాలు చేస్తోంది. అందుకే దివంగత వైఎస్ సోదరుడు వివేకానందకు మంత్రి పదవి ఇవ్వాలనుకోవటం, కెవిపితో కాంగ్రెస్ పెద్దలు మంతనాలు చేయటం. ఇవన్నీ జగన్ను పార్టీ పెట్టే దిశలో మరింత పురికొల్పుతున్నాయని పలువురు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications