వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు ప్రారంభించారు, వైయస్ పూర్తి చేశాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-YS Rajasekhar Reddy
రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు నడిపించాలనే ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిరర్ధక ఆస్తులను విక్రయించడం ద్వారా ఆర్థిక వనరులను సమీకరించడం ఒకటి. రింగ్ రోడ్డు, ఫోర్ లైన్ రోడ్ల వంటి భారీ రహదారుల నిర్మాణాలు మరోటి. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఇంకోటి. ఈ రెండు ప్రయత్నాలు కూడా చంద్రబాబు హయాంలోనే ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పలు ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరమయ్యాయి. లాభాల్లో నడుస్తున్న సంస్థలను కూడా అతి తక్కువ ధరకు ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం చేశారు.

కాగా, రోడ్ల నిర్మాణాలకు విరివిగా స్థలాలు సేకరించారు. ప్రభుత్వ భూములను పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో తక్కువ ధరకు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టారు. చంద్రబాబు హయాంలో ఇవన్నీ ప్రారంభమయ్యాయి. అయితే, వీటిలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్లు అక్రమాలు జరిగాయా అనే విషయాన్ని నిర్ధారించలేం. చంద్రబాబుకు సన్నిహితులైనవారు లబ్ధి పొంది ఉండవచ్చు. అయితే, వైయస్సార్ హయాంలో జరిగినట్లు మాత్రం జరగలేదు. వైయస్సార్ రెండో సారి అధికారంలోకి వచ్చిన ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్‌లకు) భారీగా భూసేకరణ జరిగింది. దేశంలో అత్యధిక సెజ్‌లు ఆంధ్రప్రదేశ్‌లోనే రూపు దిద్దుకున్నాయి. ఈ వ్యవహారంలో వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూములు పొందినవారి నుంచి జగన్ లబ్ధి పొందారనేది ప్రధానమైన ఆరోపణ.

అలాగే, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రకటించిన భారీ పరిశ్రమలేవీ రూపుదిద్దుకోలేదు. ఫ్యాబ్ సిటి, వోక్స్ వ్యాగన్, సైన్స్ సిటీ వంటి పలు భారీ పరిశ్రమలు వస్తున్నట్లు వైయస్ ప్రకటించారు. వాటికి భూములు కేటాయించే పని కూడా చేశారు. ఎక్కడెక్కడ ఆ పరిశ్రమలు వస్తున్నట్లు ప్రకటించారో దానికి ముందే ఆయా ప్రాంతాల చుట్టుపక్కల వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులైనవారు భూములు కొనుగోలు చేసి వైయస్ ప్రకటన వెలువడిన వెంటనే అమ్మేసి గణనీయంగా లాభాలు సాధించారని అంటారు. ఆ తర్వాత పరిశ్రమలేవీ రాకపోవడంతో విలువ తగ్గి భూములు కొన్నవారు దివాళా తీశారని చెబుతారు. మొత్తం మీద, ప్రైవేటీకరణ, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, పరిశ్రమలకు పెట్టుబడులను ఆహ్వానించడం అనే వలయం పెద్ద తమాషాగా మారింది. రైతులు తక్కువ ధరకు భూములు కోల్పోయి రియల్ ఎస్టేట్ వ్యారారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది.

English summary
It clear that policies started by TDP president N Chandrababu Naidu are implemented by YS Rajasekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X