తమిళనాడులో చిరు హిట్టవుతారా?

తమిళనాడులో చాలా చోట్ల తెలుగువాళ్లు ఉన్నారు. తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో చిరంజీవి ప్రచారం తమకు ఉపయోగపడుతుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. చిరంజీవి కొంత కాలం తమిళనాడులో నివాసం కూడా ఉన్నారు. ఆయనకు మాత్రమే కాకుండా ఆయన బావమరిది అల్లు అరవింద్‌కు కూడా సంబంధాలున్నాయి. నిర్మాతగా అల్లు అరవింద్ తనకున్న సంబంధాలతో సినీ తారలను కూడా కాంగ్రెసు తరఫున ప్రచారంలోకి దించుతారా అనేది ఆసక్తికరంగా మారింది.
తమిళనాడులో డిఎంకెతో కాంగ్రెసు పార్టీ పొత్తు పెట్టుకుంది. డిఎంకెకు తారాబలం దండిగానే ఉంది. డిఎంకె నేత, ముఖ్యమంత్రి కరుణానిధి సినీరంగానికి చెందినవారు కావడం అందుకు ఓ కారణం. డిఎంకెకు ఉన్న సినీ తారల బలానికి చిరంజీవి బలం కూడా తోడవుతుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. తమిళనాడులో తాను చేపట్టబోయే ప్రచార కార్యక్రమంపై చిరంజీవి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో చర్చిస్తారు. దానితో పాటు కాంగ్రెసులో ప్రజారాజ్యం విలీనసభపై కూడా మాట్లాడుతారు.












Click it and Unblock the Notifications