వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు ఎంపిలకు కెసిఆర్ భయం

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు భయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేస్తే పరిస్థితి ఏమవుతుందో అనే విషయంలో ఈ భయాలు వ్యక్తమవుతున్నాయి. రాజీనామాలు చేస్తే తాము గెలిపిస్తామని కెసిఆర్ కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులకు హామీ ఇచ్చారు. అయితే, కెసిఆర్ ఆ మాట నిలబడుతారా అనే అనుమానాలు కాంగ్రెసు తెలంగాణ ఎంపిల నుంచి వ్యక్తమవుతోంది. కెసిఆర్ సహకరించకపోతే తమ భవిష్యత్తు దెబ్బ తింటుందనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. తాము రాజీనామాలు చేయడం వల్ల తిరిగి ఎన్నికలు వస్తే తమపై కెసిఆర్ తెరాస అభ్యర్థులను రంగంలోకి దిగినా ఆశ్చర్యం లేదని వారు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్‌ను కూడా నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు. కోదండరామ్ కెసిఆర్ వ్యూహానికి అనుగుణంగా, తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. తీరా రాజీనామాలు చేసిన తర్వాత ఏదో సాకు చూపి తమపై తెరాస అభ్యర్థులు పోటీకి దిగితే ప్రమాదం వాటిల్లుతుందని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు భావిస్తున్నారు.

కెసిఆర్ మాట నిలబడరనే అభిప్రాయం ఉంది. రాజకీయాలను, పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎంతటికైనా తెగిస్తారని అంటున్నారు. అందువల్ల తాము రాజీనామాలు చేస్తే మొదటికే మోసం రావచ్చునని కాంగ్రెసు ఎంపిలు అనుకుంటున్నారు. జులై 5వ తేదీన తెలంగాణ కోసం నిరవధిక నిరాహార దీక్షలు చేయాలని వారు నిర్ణయించుకున్నారు. నిరవధిక నిరాహార దీక్షలను భగ్నం చేస్తే రాజీనామాలు చేయాలనే ఆలోచన కూడా చేశారు. అయితే, కెసిఆర్ వైఖరిపై భయంతో వారు మీమాంసలో పడ్డట్లు తెలుస్తోంది. ఏమైనా, కెసిఆర్ వారికి కచ్చితమైన భరోసా ఇస్తారా, తన పార్టీకి ప్రయోజనం కలిగించే విధంగా వారిని వాడుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.

English summary
Congress Telangana MPs are not believing TRS president K Chandrasekhar rao. So, they are not in a plan to resign to achieve telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X