పులివెందులపై సీరియస్‌నెస్ కోసమే..

వ్యవసాయ శాఖ మంత్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి శాసనమండలి ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున బరిలో దిగడానికి వెనక్కి తగ్గడానికి వెనుక పెద్ద కారణమే ఉన్నట్టుగా తెలుస్తోంది. మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కడప, పులివెందుల ఉప ఎన్నికలలో గట్టిగా ఎదుర్కొనాలంటే కేవలం అదే కుటుంబానికి చెందిన వైఎస్ వివేకానందవల్లనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీతో పాటు వివేకానంద కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కన్నా ఎమ్మెల్యే ఎన్నికలే ముఖ్యం. అయితే వివేకానందను ఎమ్మెల్సీగా మరోసారి ఎన్నుకోవడం వల్ల జిల్లాలోని ఓటర్లలోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

మొదటినుండి పులివెందులనుండి ఎమ్మెల్యేగా వైఎస్ వివేకాను నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. దివంగత వైఎస్ఆర్ సతీమణిని, జగన్‌ను తట్టుకోవాలంటే స్థానికంగా పట్టు ఉన్న వివేకానే సమర్థుడని భావిస్తోంది. అయితే ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఆయననే నిలబెట్టాలని భావించింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలబెట్టి గెలిచాక కూడా మళ్లీ ఎమ్మెల్యే ఎన్నికలలో నిలబెట్టాలని భావించింది. అయితే ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా గెలిస్తే ఉప ఎన్నికల్లో ఓటు వేసే వారు వివేకా లేక పోవడం వల్ల కాంగ్రెస్‌కు ఓటు వేయకుండా జగన్‌ పార్టీకి వేసే అవకాశాలు ఉన్నాయి. వివేకా గెలిచాడు కాబట్టి ఆయనకు వేయడం లాభం లేదనే ఉద్దేశ్యంలో వోటర్లు ఉండే అవకాశం ఉందని, అందుకే ఆయనను ఎమ్మెల్సీ ఎన్నికలనుండి తప్పించడమే సరియైన నిర్ణయంగా కాంగ్రెస్ భావించినట్టుగా తెలుస్తోంది.

కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వివేకా తప్పితే కాంగ్రెస్‌కు మరో మార్గం లేదు. ఇన్ని సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. దానిని జగన్ వర్గం కూడా ఇంతకుముందు రెండుసార్లు కాంగ్రెస్ గెలుపు కాదని, వైఎస్ఆర్ గెలిపించినందునే అధికారంలోకి వచ్చిందనే గట్టి వ్యూహంతో ప్రజలలోకి వెళతారు. ఇవన్నీ తలనొప్పులకు బదులు గెలిచే అవకాశమున్న వివేకాను ఎమ్మెల్సీ నుండి తప్పించి ఉప ఎన్నికల పోరులోనే నిలబెట్టడం అత్యుత్తమంగా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+