వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా జన్మదినం లోపు సిఎం మార్పు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని డిసెంబర్ 9వ తేది లోపు మారుస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9న ఉన్న విషయం తెలిసిందే. ఆలోపు కిరణ్‌ను మార్చే అవకాశాలున్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెసు స్టీరింగ్ కమిటీ పెద్దలు ఢిల్లీ పెద్దలను కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఆ తర్వాత వారు ముఖ్యమంత్రిని మార్చాలని కూడా అధిష్టానాన్ని కోరారట. కిరణ్ వైఖరి వల్లే తెలంగాణలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి బాగా లేదని, సిఎంను మార్చితే పరిస్థితి చక్కబడుతుందని వారు ఢిల్లీ పెద్దలకు చెప్పినట్లుగా సమాచారం. సిఎం తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేయాలని చూస్తున్నారని, తెలంగాణలో కాంగ్రెసు పరిస్థితి బాగుపడాలన్నా, టిఆర్ఎస్‌లోకి తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేల వలసలు ఆగి పోవాలన్నా కిరణ్‌ను మార్చడమే ఉత్తమమని ఢిల్లీ పెద్దలకు సూచించారట.

పీఠంపై ఎవరిని కూర్చుండ బెట్టినా తమకు అభ్యంతరం లేదని ఆయితే మార్పు మాత్రం కావాల్సిందేనని చెప్పారట. కాంగ్రెసు తెలంగాణ ఎంపీలు కూడా సిఎంపై పలుమార్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. సిఎంపై అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వారి ఫిర్యాదుకు ఢిల్లీ నేతలు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే సోనియా జన్మదినం లోపు మార్పు ఉంటుందని అప్పటి వరకు వలసలు లేకుండా చూడాలని తెలంగాణ నేతలకు వారు సూచించారట. కాగా టిఆర్ఎస్‌లోకి మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జూపల్లి, సోమారపు, రాజయ్య టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

వీరే కాకుండా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు కూడా టిఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. వారు ఈ మేరకు టిఆర్ఎస్‌తో చర్చలు కూడా జరిపారట. పార్టీ మారేందుకు ఈ నెల 10న ముహూర్తం పెట్టుకున్నారని సమాచారం. ఈ నెల 6వ తేదినే టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవాలని అనుకున్నప్పటికీ బక్రీద్ తర్వాత తెలంగాణపై నిర్ణయం అని చిదంబరం సోమవారం ప్రకటించడంతో వారు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు వేచి చూడాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అయితే కేంద్రం ఇప్పటికిప్పుడు ప్రత్యేక ప్యాకేజీలు తప్ప తెలంగాణ ఇచ్చే అవకాశం లేదని, దీని బదులు బయటకెళ్లడమే ఉత్తమమని మరికొందరు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

English summary
The roumers were came that Congress High Command will change CM Kiran Kumar Reddy before AICC president Sonia Gandhi's birth day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X