చిరంజీవి దిగి వస్తున్నారా, ఆంతర్యం అదేనా?

Chiranjeevi
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత ఏం చేయాలో తెలియక చిరంజీవి దిగి వస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తిరుపతిలో ఆయన బుధవారం మాట్లాడిన మాటలు ఆ అనుమానాలకు తావిస్తున్నాయి. తనకు ఎప్పుడు పదవి ఇస్తారో, ఎంత వరకు తాను వేచి ఉండాలో తెలియక చిరంజీవి సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. తనకు కేంద్రంలో గానీ రాష్ట్రంలో గానీ మంత్రి పదవి ఇస్తే చాలునని, పదవి ఏదైనా ఉంటే సేవ చేయడానికి ఓ ఆదరవు దొరుకుతుందని ఆయన అన్నారు. దీన్ని బట్టి తనను ఇలా నిరీక్షణలో పెట్టకుండా ఏదైనా పదవి ఇవ్వాలనే విజ్ఞప్తి ఆ ప్రకటనలో ఉందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించి రాజకీయాల్లోకి దిగి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి కాంగ్రెసులో చేరిన తర్వాత రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చినా సంతృప్తి పడే స్థితికి వచ్చారని అంటున్నారు.

కాగా, అనూహ్యంగా పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను కాంగ్రెసు అధిష్టానం తెర మీదికి తేవడంతో చిరంజీవిలో ఆందోళన ప్రారంభమైనట్లు చెబుతున్నారు. తనకు దక్కాల్సిన హోదా, పదవి శ్రీనివాస్ ఎగరేసుకు పోతారని చిరంజీవి ఆందోళనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. దీంతో తనకు ఏ పదవి ఇచ్చిన ప్రస్తుతానికి సంతృప్తి చెందాలనే స్థితికి వచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు తీవ్రమైన అనిశ్చితికి చేరుకోవడంతో కూడా చిరంజీవికి బాధ్యతలు అప్పగించే విషయంలో అధిష్టానం జాప్యం చేస్తోందనే మాట వినిపిస్తోంది. ఏమైనా, చిరంజీవి పరిస్థితి అంత సజావుగా లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+