చిరంజీవికి ఆ దమ్ముందా?

చిరంజీవి రెండురోజుల క్రితం కడపలో విలేకరులతో పార్టీలో అందరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారని ఆ దిశలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. పార్టీలో చాలామంది వారిపై చర్యలు తీసుకోవాలనే అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే చిరంజీవికి వారిపై చర్యలు తీసుకునే దమ్ము ఉందా అంటే మాత్రం అనుమానమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తామని బాహాటంగా ప్రకటించిన తర్వాత, విలీనానికి సన్నద్ధమయి ఉన్నప్పుడు వారిపై వేటు వేయడం కష్టమే అంటున్నారు. మరో విషయం ఏమంటే వారిపై వేటు వేయడానికి పార్టీ దగ్గర సరియైన ఆధారాలు కూడా ఏమి లేవని తెలుస్తోంది. విలీనం సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్న వారిపై చర్యలు అంటే సాహసమే అని పార్టీలోని వారే కొందరు చిరంజీవికి సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అంతేకాదు పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేస్తామని పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకున్న సమయంలో సదరు ఎమ్మెల్యేలకు తెలియదంట. విలీనంపై వారి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దీంతో వారిపై చర్యలు తీసుకుందామని పార్టీ నిర్ణయం తీసుకుంటే సరియైన ఆధారాలు లేక పోవడం ఒకటి కాగా, వారే తిరిగి పార్టీని విలీనంతో పాటు పలు ప్రశ్నలతో పార్టీని కంగారెత్తించే అవకాశముందంట. ఆ కారణంగానే పార్టీలో మెజార్టీ నేతలు చర్యలు తీసుకోవాల్సిందే అని సూచించినప్పటికీ చర్యలు వద్దంటున్న వారి వ్యాఖ్యలతో చిరంజీవి వేటుపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేక పోతున్నారంట.












Click it and Unblock the Notifications