జయప్రదతో హసన్ అలీకి లింకు?

Jayaprada
ఒకప్పటి తెలుగు టాప్ హీరోయిన్, రాజకీయ నాయకురాలు జయప్రదకు నల్ల డబ్బు కుంభకోణంలో అరెస్టు అయిన హసన్ అలీతో లింకులు ఉన్నాయా అంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హసన్ అలీ సన్నిహితుడు కపూరియాను ఈడి విచారించాయి. ఆ విచారణలో కపూరియా మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళా రాజకీయ నేతలకు కూడా అలీతో సంబంధాలు ఉన్నట్లు చెప్పినట్టుగా తెలుస్తోంది. కపూరియా వారి పేర్లు చెప్పనప్పటికీ వారి విషయాలు పరోక్షంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆయన చెప్పిన విషయాలు రాష్ట్రానికి చెందిన జయప్రద, రేణుకా చౌదరివైపు వేళ్లు చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో గ్లామర్ క్వీన్‌గా ఉన్న ఓ మహిళా 1994-95లో రాష్ట్రంలో చక్రం తిప్పిందని, ఆ తర్వాత జాతీయ స్థాయిలో వెలుగు వెలిగిందని చెప్పారు. ఈ విషయం జయప్రదనే అనే విషయం బలపరుస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగులో హీరోయిన్‌గా విశేష ఆధరణ పొంది, ఆ తర్వాత టిడిపిలో చేరి అనంతరం ఎస్పీలో చేరి జాతీయస్థాయి నేతగా ఎదిగారు. ఇప్పటికే అమర్‌సింగ్‌తో ఆమెపై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే జయప్రదకు తనపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు అంతగా లేవు. అలీతో సంబంధాలపై ఖచ్చితమైన ఆధారాలు వస్తే మాత్రం స్పందించవలసి ఉంటుంది.

రాష్ట్రానికి చెందిన మరో మహిళా నేత కూడా అలీతో లింకులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆమె రేణుకా చౌదరి. రేణుకపై ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఇదే మొదటిసారి. రేణుకకు, అలీకి మంచి సంబంధాలు ఉన్నాయంట. ఎంతగా అంటే.. ఆమెకు డైమాండ్స్ కూడా ఇవ్వాలనుకున్నాడంట అలీ. 1984లో సిక్కుల ఊచకోతలో సంబంధం ఉన్న ఓ నేత రేణుకను అలీకి పరిచయం చేశాడంట. కపూరియా చెప్పిన వీడియో సాక్ష్యాలు ప్రస్తుతం సుప్రీం కోర్టు వద్ద ఉన్నాయి. అంతేకాదు, అలీకి ఢిల్లీ పెద్దలతో కూడా సంబంధాలు ఉన్నాయంట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+