జగన్ పార్టీ పేరులో కాంగ్రెస్ అందుకేనా?

YSR Congress Party
మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తన ఇమేజ్ తగ్గుతుందని భావిస్తున్నాడా అంటే అవుననే అంటున్నారు పలువురు. శనివారం జగన్ తన పార్టీని ప్రకటించాడు. తన పార్టీలో వైఎస్, కాంగ్రెస్‌ను కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పెట్టారు. జగన్ కాంగ్రెస్ వీడి బయటకు వచ్చిన తర్వాత జగన్ కొత్త పార్టీ పెడతారని అయితే అందులో కాంగ్రెస్ పేరు ఉండకుండా చూసుకుంటారనే కామెంట్లు వినిపించాయి. కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పేరు వాడుకొని సొమ్ము చేసుకోవడానికి ఆయన ఇష్టపడటం లేదనే వాదనలు అప్పుడు వినిపించాయి.

నల్గొండ జిల్లాకు చెందిన శివకుమార్‌కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా కేవలం ఉప ఎన్నికల వరకే తీసుకుంటారని తనకు కేంద్ర ఎన్నికల సంఘం నుండి అనుమతులు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ లేదా మరేదైనా ఆలోచిస్తారని చెప్పారు. కానీ జగన్ ఆఖరకు కాంగ్రెస్ పేరు లేకుండా పార్టీని ప్రకటించ లేకపోయాడు. జగన్ తనకు ఇమేజ్ తగ్గిందని భావించడం వల్లనే తన పార్టీ పేరులో కాంగ్రెస్‌ను కలిపి లాభం పొందాలని చూస్తున్నారనే వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. గతంలో కూడా పలువురు కాంగ్రెస్ నేతలు, మంత్రులు జగన్‌కు దమ్ముంటే కాంగ్రెస్ పేరు లేకుండా పార్టీ పెట్టుకోవాలని ఛాలెంజ్ చేశారు. కానీ జగన్ మాత్రం ఆ పేరు లేకుండా పార్టీని పెట్టలేక పోయాడు. కాంగ్రెస్ పేరు లేకుండే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందనే భావనతోనే ఆ పేరుతో పార్టీని ప్రకటించినట్లుగా పలువురు భావిస్తున్నారు.

అంతేకాదు జగన్ మరో అడుగు ముందుకేసి పార్టీ జెండాలో వైఎస్ ఫోటోతో పాటుగా వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలను కూడా జెండాలో ఉంచారు. కాంగ్రెస్ పేరు, వైఎస్ పేరుతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన ప్రవేశ పెట్టిన పథకాలను కూడా ఆయన క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ పార్టీ వీడాక ప్రజలనుండి వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు రాకపోవడం వల్లనే ఆయన వాటి ద్వారా ప్రజలలోకి వెళితేనే వారు తనను గుర్తించే అవకాశం ఉందని భావిస్తున్నట్టుగా ఉన్నారు. మొత్తానికి కాంగ్రెస్ పేరుతో పాటు, పథకాలను తన జెండాలో పెట్టుకోవడం వల్ల జగన్‌కు తన ఇమేజ్ తగ్గిందనే అనుమానంతో పాటు వాటి ద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తూ తాను లాభ పడవచ్చనే భావనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+