చిరంజీవిపై రాహుల్ గాంధీకి మెగా ఆశలు

2014 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని విజయపథాన నడిపించి, తాను ప్రధాని పదవి చేపట్టాలని రాహుల్ గాంధీ అనుకుంటున్నారు. కేంద్రంలో కాంగ్రెసు అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక సీట్లు సాధించడం అనివార్యంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్‌లో సాధించుకున్న సీట్ల ద్వారా మాత్రమే అధికారంలోకి రాగలిగిందనే అభిప్రాయం ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుకు ఓట్లను తెచ్చే పెట్టే కీలకమైన నాయకుడిగా చిరంజీవిని రాహుల్ గాంధీ భావిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా యువతను, విద్యార్థులను కాంగ్రెసు వైపు కూడగట్టడానికి చిరంజీవి ఇమేజ్ పనికి వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు.
రాహుల్ గాంధీ యువతను, విద్యార్థులను కాంగ్రెసులోకి తేవడానికి దేశవ్యాప్తంగా పర్యటనలు కూడా చేశారు, చేస్తున్నారు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సాంప్రదాయిక ఓటర్లు సరిపోరని, యువతను ఆకర్షించడం అవసరమని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని యువతో చిరంజీవి అంటే క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ను ఓట్ల రూపంలోకి మార్చకోవడానికి చిరంజీవి పనికి వస్తారని అంటున్నారు. అలాగే, రాష్ట్రంలోని యువత ఎక్కువగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారనే అభిప్రాయం ఉంది. వైయస్ జగన్ వైపు యువత వెళ్లకుండా చిరంజీవిపై ఉన్న అభిమానం కూడా పనిచేస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications