తెలంగాణ నో, ప్రాంతీయ మండలికే ఓటు?

Telangana
కేంద్రం తెలంగాణ సమస్యపై ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సమస్యను అప్పుడు పరిష్కరిస్తాం ఇప్పుడు పరిష్కరిస్తామంటూ చెబుతూ వచ్చిన కేంద్రం దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. తెలంగాణకు ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిపై కేంద్రం ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ పరిధిలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. బోడోలాండ్ ప్రాంతీయ మండలి, గూర్ఖాలాండ్ ప్రాంతీయ మండలి తరహాలోనే తెలంగాణకు ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయడమే ఉత్తమమని కేంద్రం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాంతీయ మండలికి ప్రధాన కార్యనిర్వాహక సభ్యుడుగా పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కే అవకాశం దక్కవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

డిఎస్ గురువారం ఢిల్లీ రావడంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. తెలంగాణ ఎంపీల మధ్య ఎస్సెమ్మెస్‌లు కూడా వేగంగా ప్రవహించాయట. ప్రాంతీయ మండలి చైర్మన్ పదవి కోసమే డిఎస్ వచ్చారని, మనం అప్రమత్తంగా ఉండాలని, సోనియా జన్మదినం శుక్రవారం ఉన్న సందర్భంగా ఈ మేరకు ప్రకటన రావచ్చని కాంగ్రెస్‌లోని తెలంగాణ ఎంపీల మధ్య గుసగుసలు సాగాయట. ఇదే విషయాన్ని డిఎస్ వద్ద ప్రస్తావిస్తే అలాంటిదేమీ లేదని కొట్టి పారేశారు. అయితే డిఎస్ అంటే గిట్టని తెలంగాణ ఎంపీలు కొందరు ఈ ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌లోని ఒక సీనియర్ ఎంపి వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+