వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ చెల్లెమ్మలపై సాక్షి విసుర్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sakshi
మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సాక్షి టెలివిజన్ మహిళా మంత్రులను టార్గెట్ చేసుకొని ఓ కథనాన్ని ప్రసారం చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని ప్రభుత్వంలోని మంత్రులు, నేతలు లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తున్నప్పటికీ వైయస్ తన చెల్లెల్లుగా చెప్పుకున్న మహిళా మంత్రులు వాటిని ఖండించడం లేదంటూ పేర్కొన్నది. సబితారెడ్డి, గీతారెడ్డి, డికె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, గల్లా అరుణకుమారి వంటి మహిళలను చెల్లెల్లుగా చూసేవాడని, వారికి ప్రత్యేకంగా చూసేవారని, అలాంటి వారు ఇప్పుడు వైయస్‌పై ఆరోపణలు వస్తున్నప్పటికీ ఏమీ మాట్లాడటం లేదని చెప్పింది.

మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి, శంకర్‌రావు, రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు వంటి వారు వైయస్‌పై నిత్యం అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారని, అయితే ఆయన మంత్రివర్గంలో పని చేసి, ఆయన చెల్లెల్లుగా వారు మాత్రం మిన్నకుండిపోయారన్నది. అన్నయ్యా అంటూ రాఖీ కట్టిన చెల్లెల్లు ఆ అన్నయ్యపై ఇప్పుడు ఆరోపిస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించింది. రాష్ట్ర చరిత్రలో తొలి మహిళా హోంమంత్రిగా సబితారెడ్డిని కూర్చోబెట్టిన ఘనత వైయస్‌ది అని, మహిళలకు మంత్రివర్గంలో మంచి పీట వేసిన ఘనత వైయస్‌ది అన్నారు. కాగా కేవలం ఒక మాజీ మంత్రి కొండా సురేఖ మాత్రమే వైయస్‌పై ఆరోపణలకు స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకు వచ్చిన ఘనత వైయస్‌ది అని, పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కష్టపడ్డ వ్యక్తిపై బురద జల్లడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించింది.

English summary
Ex MP YS Jagan's Sakshi news channel questioned women ministers for their silence on allegations made against former Chief Minister YS Rajasekhar Reddy. DL Ravindra Reddy and Shankar Rao and others are questioning scams took place in YSR regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X