తెలంగాణపై చంద్రబాబుకు ఊరట

Chandrababu Naidu
తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు చాలా వరకు ఊరట లభించినట్లే చెప్పవచ్చు. ఇంత వరకు తన తెలంగాణ పర్యటనలను అడ్డుకుంటూ వచ్చిన తెలంగాణవాదుల నుంచి ఆయన ఆ ఊరట లభించింది. తన తెలంగాణ రైతు పోరు బాటలో భాగంగా ఆయన తెలంగాణకు చెందిన ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఆయన పాదయాత్ర చేశారు. తెలంగాణ ఊసే లేకుండా ఆయన పాదయాత్ర సాగింది. ఖమ్మం జిల్లాలో తెలంగాణపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించినా ఆయన మాట్లాడడానికి నిరాకరించి, వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తెలంగాణపై చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంపై తెలంగాణవాదులు ధ్వజమెత్తుతూ వచ్చారు. చంద్రబాబు తెలంగాణ పర్యటనను అడ్డుకోబోమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు ప్రకటించడం చంద్రబాబుకు అనుకూలంగా మారింది.

తెలంగాణవాదం కాస్తా తక్కువగా ఉన్న ఖమ్మం, నల్లగొండ జిల్లాలను ఈసారి చంద్రబాబు తన రైతు పోరు బాట కార్యక్రమానికి ఎంచుకున్నారు. రెండో విడత తెలంగాణవాదం ఎక్కువగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ వంటి జిల్లాలను ఎంచుకోవచ్చునని అంటున్నారు. ఆ రకంగా ఆయన తెలంగాణలో పర్యటించి క్యాడర్‌లో విశ్వాసం కలిగించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. మరి, ఈ జిల్లాల్లో చంద్రబాబుకు ఏ విధమైన ప్రతిస్పందన లభిస్తుందో ఇప్పుడే చెప్పలేం. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు, తెలంగాణ వ్యతిరేక వైఖరిని వీడనంత వరకు చంద్రబాబును తెలంగాణ ప్రజలు నమ్మబోరని తెరాస నాయకులు అంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును పోలవరం టెండర్ల విషయంలో ఇరకాటంలో పెట్టామని, నైతికంగా దెబ్బ తీయగలిగామని తెలుగుదేశం నాయకత్వం భావిస్తోంది. ఈ స్థితిలో తెలంగాణలో తిరిగి తమ బలాన్ని పునరుద్ధరించుకునే వ్యూహాన్ని అమలు చేయాలని అనుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదనే గట్టి నమ్మకంతో కూడా చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ తెలంగాణ ఉద్యమం వేడి తగ్గుతుందని కూడా ఆయన నమ్ముతున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో తన పార్టీని కాపాడుకోవడానికి తెలంగాణలో పర్యటించాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+