తెలంగాణ నేతలకు జీతాలు ఫుల్

ఒకసారే కాదు రెండోసారి రాజీనామాలు చేసిన నేతలూ బ్యాంకులో పడిన డబ్బులు వాడేసుకున్నారట. తెలంగాణ కోసం అంటూ టిడిపి నుండి బయటకు వచ్చిన నాగర్ కర్నూల్ శాసనసభ్యుడు, తెలంగాణ నగారా సమితి చైర్మన్ నాగం జనార్ధన్ రెడ్డితో పాటు రాజకీయ సంక్షోభం అన్న తెలుగుదేశం పార్టీ నేతల వరకు అందరూ జీతాలు తమ ఖాతాలో వేసుకున్నావారేనట. రాజీనామా చేసిన కాంగ్రెసు ప్రజా ప్రతినిధులూ అదే దారిలో ఉన్నారు. ఇక తమ పార్టీ తెలంగాణ సాధన కోసం పుట్టిందని నిత్యం చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు జీతాలు తీసుకోవడంలో ముందే ఉన్నారట. నిత్యం ఆందోళనలో పాల్గొని సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు, సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారక రామారావు ఠంచనుగా జీతాలు తీసుకున్నారు.
అయితే విధులలో పాల్గొన వద్దని తమకు చెప్పి తెలంగాణ కోసమంటూ రాజీనామాలు చేసి జీతాలు తీసుకోవడమేమిటని తెలంగాణ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారట. తెలంగాణపై నేతలకు చిత్తశుద్ధి ఉంటే తమ జీతాలు తీసుకొని సమ్మెలో పాల్గొనే పేద ఉద్యోగులకు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారట.












Click it and Unblock the Notifications