అమెరికాలో తెలంగాణ మార్చ్

గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం దేశంలోని మూలమూలలకు వ్యాపించిందని, బ్రిటిష్ పాలకులను పంపించి వేయడానికి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఆ ఉద్యమం స్థానిక నాయకులకు ఓ ఆయుధంగా ఉపయోగపడిందని ఈ మార్చ్ సందర్భంగా ప్రసంగించిన వక్తలు అన్నారు.ఆంధ్రప్రదేశ్ విభజనకు పాటుపడుతున్న భావసారూప్యత గల స్థానిక నాయకుల వెనక తెలంగాణ ప్రజలు ర్యాలీ కావాలని వారు కోరారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చూసైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర విభజనకు ముందుకు రావాలని వారు డిమాండ్ చేశారు. అందుకుగాను వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని వారు విజ్ఢప్తి చేశారు.
మార్చి 10వ తేదీన హైదరాబాదులో జరిగే మిలియన్ మార్చ్‌లో పెద్ద యెత్తున పాల్గొనాలని వారు తెలంగాణ ప్రజలను కోరారు. మిలియన్ మార్చ్ సందర్భంగా ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా చూడాలని వారు సూచించారు. తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రజలకు వ్యతిరేకం కారని, తెలంగాణ ప్రజల స్వయం పాలన హక్కును గౌరవిస్తూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర ప్రజలు ముందుకు రావచ్చునని వారన్నారు. తెలంగాణ ఎన్నారైలు మార్చ్ సందర్భంగా జై తెలంగాణ నినాదాలు చేశారు. మిలియన్ మార్చ్ ధక్కా, తెలంగాణ పక్కా అంటూ వారు నినదించారు.












Click it and Unblock the Notifications