వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాస్తు బాబును బయటపడేస్తుందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
వాస్తు ప్రకారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేస్తున్న మార్పులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కష్టాల నుంచి గట్టెక్కిస్తాయని తెలుగుదేశం పార్టీ నాయకులు నమ్మబలుకుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వాస్తు ప్రకారం ఇటీవల మార్పులు చేపట్టారు. వాస్తు ప్రకారం మార్పులు పూర్తి కాగానే చంద్రబాబుకు మంచి రోజులు వస్తాయని విశ్వసిస్తున్నారు. తన ఆస్తులపై హైకోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశించడంతో చంద్రబాబుకు తీవ్రంగా దెబ్బ తీసింది. నిజానికి, చంద్రబాబుకు అతీతశక్తుల మీద నమ్మకం లేదు. కానీ బావమరిది బాలకృష్ణ సలహా మేరకు పార్టీ కార్యాలయంలో మార్పులు చేపట్టారు.

పార్టీ కార్యాలయంలో మార్పులకు కేరళకు చెందిన వాస్తు నిపుణుడిని సంప్రదించారు. 2004లో గంగయ్య చౌదరి అనే వాస్తు నిపుణుడి సలహా మేరకు పార్టీ కార్యాలయంలో స్వల్ప మార్పులు చేశారు. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు కావడంతో ఆ వాస్తు నిపుణుడికి తిలోదకాలు ఇచ్చారు. గంగయ్య చౌదరి కన్నా కేరళకు చెందిన వాస్తు నిపుణుడు ప్రతిభావంతుడని తెలుగుదేశం వర్గాలు నమ్ముతున్నాయి.

వాస్తు ప్రకారం - దక్షిణవైపు ఉన్న పార్టీ కార్యాలయం ముఖద్వారాన్ని మూసేసి తూర్పు వైపు పెడుతున్నారు. అంగరక్షకుల కోసం కొత్త కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు ఆరేడు మార్పులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కార్యాలయంలోకి తూర్పు దిశ నుంచి నేరుగా సెల్లార్‌లో కారులో వెళ్లి అక్కడి నుంచే తన గదికి చేరుకునే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మార్పులన్నీ పూర్తయిన తర్వాత చంద్రబాబు కష్టాల నుంచి గట్టేక్కుతారో, లేదో చూడాలి.

English summary
It is said that Vaastu changes in office may help TDP president N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X