వైయస్ జగన్ వ్యాఖ్యలు వ్యూహాత్మకమేనా?

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీతో కలవనని, తిరిగి కాంగ్రెసు పార్టీలోకి వెళ్లనని, జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బిజెపియేతర కూటమితోనే కలుస్తానని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఆ వ్యాఖ్యలను పక్కా వ్యూహంతోనే చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. కర్నాటక మాజీ మంత్రి, బిజెపి సీనియర్ శాసనసభ్యుడు గాలి జనార్ధన్ రెడ్డితోనూ సంబంధంలు లేవని చెప్పడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. తన ఆస్తులపై సిబిఐ దర్యాఫ్తు చేస్తున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో అక్రమ మైనింగ్ కేసులో అరెస్టైన గాలితో తనకు సంబంధాలు ఉన్నాయని చెబితే తనకే నష్టమని భావించే ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అందుకే గాలికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లుగా భావిస్తున్నారు. కానీ గాలి, జగన్‌ల సంబంధాలు జగమెరిగిన సత్యమే అనేది వారి వాదన. అంతేకాదు 2009లో మీడియా సమావేశంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనకు తండ్రి లాంటి వాడని, జగన్ తన సోదరుడని గాలి స్వయంగా చెప్పారు. అంతేకాదు జగన్, గాలికి వ్యాపార సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే గాలితో తన సంబంధాలు, పార్లమెంటులో తనకు బిజెపి మద్దతు పలకడం తదితర కారణాల వల్ల తాను ఎప్పటికైనా బిజెపి పక్షాన చేరే అవకాశం ఉందని ప్రజలు భావిస్తారనే ఉద్దేశ్యంతో వారి అనుమానాలు నివృత్తి చేసే వ్యూహంలో భాగంగానే జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా కాంగ్రెసులో తిరిగి చేరనని, బిజెపియేతర పక్షాలు కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మద్దతు ఇస్తానని చెప్పారు.

బెజెపియేతర పక్షాలు అంటే కాంగ్రెసు ఉన్న యుపిఏకు మద్దతు ఇస్తానని జగన్ చెప్పినట్లేనని తెలుగుదేశం వంటి పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. కాంగ్రెసులో చేరనని చెప్పారు కానీ అదే సమయంలో బిజెపియేతర పక్షానికి మద్దతు పలుకుతానని పరోక్షంగా చెప్పడం అంటే ఎప్పటికైనా కాంగ్రెసులోచేరకుండా యుపిఏకు మద్దతు మాత్రమే పలుకుతానని చెప్పడమే అందులోని అర్థమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాము మొదటి నుండి జగన్ ఎప్పటికైనా కాంగ్రెసు గూటికి చేరే వాడని అంటున్నామని ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు కూడా వాటినే నిరూపిస్తున్నాయని టిడిపి నేతలు అంటున్నారు. ప్రస్తుతం తనపై జరుగుతున్న సిబిఐ దాడుల నుండి తప్పించుకోవడానికి జగన్ బిజెపికి మద్దతు పలకనని చెప్పి యుపిఏ భాగస్వామ్యాలకు దగ్గరవ్వాలని చూస్తున్నారని కానీ రాజకీయాల్లో ఏ పార్టీతోనైనా కలిసే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో బిజెపికి పెద్దగా బలం లేనందున ఆయన దానిని ఎన్నుకునే అవకాశాలు లేక పోవచ్చునని అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+