వికీలీక్స్: వైయస్ పాలనలో అవినీతి బారెడు

వైయస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే అమెరికా అధికారులు ఇక్కడి అవినీతిని గుర్తించింది. హైదరాబాదులో పర్యటించిన చెన్నై కాన్సులేట్ అధికారులు కరప్షన్ ప్లేగ్స్ ఆంధ్రప్రదేశ్ బిగ్ టికెట్ స్పెండింగ్ ప్రోగ్రామ్స్ పేరిట ఒక నివేదికను తయారు చేసింది.ఎపిలో అధికార కాంగ్రెసు పార్టీ సగటు జీవిని లక్ష్యంగా చేసుకొని సంక్షేమ పథకాల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని చెప్పారు. ఈ పథకాలు రాజకీయంగా ఆదరణ పొందుతున్నప్పటికీ వైయస్ ప్రభుత్వం భారతదేశంలో మునుపెన్నడూ లేనంత అవినీతికి పాల్పడుతోందన్న అర్థంలో నివేదిక ఉందని తెలుస్తోంది. నీటి పారుదల ప్రాజెక్టులు తదితర పథకాల్లో భారీ అవినీతి జరిగిందనిఅప్పట్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్‌పై అవినీతిపై బాగా విమర్శలు చేశారని చెప్పారు. వైయస్ సైతం అంతే స్థాయిలో బాబుపై విరుచుకు పడ్డ విషయం తెలిసిందే.
పథకాల్లో అవినీతిపై రాష్ట్రమంతా ఏకాభిప్రాయంతో ఉందని కాన్సులేట్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రజలకు భారీగా లబ్ధి చేకూరుతుండటంతో ప్రజలెవరూ అవినీతిని పట్టించుకోరని వైయస్ భావించినట్లుగా అందులో పేర్కొన్నారు. సంక్షేమ పథకాల మాటున వైయస్ అవినీతిని ఉన్నత వర్గాలు చీదరించుకున్నాయన్నారు. గణనీయమైన నిధులు అవినీతి కింద తరలిపోయినా కూడా ఎక్కువ మొత్తం డబ్బు సగటు జీవికి కూడా చేరేలా రూపొందించారని పేర్కొన్నారు. ఈ సంగతి దృష్టిలో పెట్టుకొన్న కాంగ్రెసు ఎంతో ఆత్మ విశ్వాసంతో ఉంది. అవినీతి అన్నది టిడిపికి ప్రధాన ఆయుధం కాబోదని భావిస్తోందని నివేదికలో పేర్కొన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications