రాజకీయాల్లో చిరంజీవి పరిస్థితే బాలయ్యకు?

Balakrishna
2014 ఎన్నికల నాటికి తాను ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తానని ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ప్రకటించిన యువరత్న నందమూరి బాలకృష్ణ చిరంజీవిలా ఫట్ అవుతాడా లేక హిట్ అవుతాడా అనే అంశం తెరపైకి వచ్చింది. అయితే చిరంజీవికి లేని అవకాశం బాలయ్యకు ఉండటం విశేషం. అది బాలయ్య రాజకీయ ఆరంగేట్రానికి ముందే రాష్ట్రంలో వేళ్లూనుకున్న టిడిపి పార్టీ. టిడిపి ఇప్పటికే ప్రజలకు పరిచయం కావడం బాలయ్యకు కలిసి వచ్చే అంశం. కానీ చిరంజీవికి ఆ అవకాశం లేకుండా పోయింది. చిరంజీవికి ఇమేజ్ రాష్ట్రంలో ఇమేజ్ ఉన్నప్పటికీ దానిని ఓటు రూపంలోకి మల్చుకోవడం కష్టం. ప్రజారాజ్యం పార్టీతో భారీ ఓటు బ్యాంకును చిరంజీవి దక్కించుకున్నప్పటికీ టిడిపికి ఇప్పటికే ఉన్న ఓటు బ్యాంకు కన్నా అది తక్కువే. ఇది బాలయ్యకు కలిసి వచ్చే అంశం.

అయితే విఫలం చెందడని కూడా ఖచ్చితంగా చెప్పలేం. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అంశంపై ఏ నిర్ణయం తీసుకోక పోవటం తెలంగాణ ప్రాంతంలో, వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావం సీమాంధ్రలో ఉండటంతో పాటు నాడు ఎన్టీఆర్ స్థాపించిన రాజకీయ పరిస్థితులు లేక పోవడం బాలయ్యకు కలిసి వచ్చే అంశాలు కావు. మరో విషయం చిరంజీవి లాగే బాలయ్య కూడా టాకేటివ్ పర్సన్ కాదనే చెప్పవచ్చును. మరోవైపు కుటుంబంలోనూ రాజకీయంగా అందరూ కలిసి రాక పోవడం తరుచూ చూస్తూనే ఉన్నాం. అదీ బాలయ్యకు మైనస్ అంశమే అయ్యే అవకాశం ఉంది. అయితే బాలయ్య రంగంలోకి దిగితే కుటుంబం కలిసి వస్తుందా లేదా చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+