'గీత'పై ప్రమాణం చేయనున్న హవాయి విన్నర్

హవాయి నుండి ఆమె బరిలోకి దిగి తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కే క్రోలేపై ఘన విజయం సాధించారు. ఆమెరికన్ నమోవాలో కేథలిక్ తండ్రికి, హిందూ తల్లికి జన్మించిన తులసి గబార్డ్ తల్లికి చెందిన హిందుత్వాన్నే స్వీకరించారు. ఆమె 2002లోనే 21 ఏళ్ల చిన్న వయస్సులో హవాయి రాష్ట్ర శాసనసభకు ఎన్నికై రికార్డ్ సృష్టించారు.
31 ఏళ్ల తులసీ గబార్డ్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అమెరికా ఎన్నికల్లో గెలిచిన వారు జనవరిలో బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ సమయంలో తులసీ భగవద్గీతపై ప్రమాణం చేస్తారు. భగవద్గీతలోని తనకు ఇష్టమైన శ్లోకాలతో ఆమె ప్రమాణం చేయనున్నారట. తన గెలుపు భారత దేశం, అమెరికా మధ్యల మరింత అనుబంధానికి తోడ్పడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా మిన్నెసోట్టా నుండి గెలిచిన కేత్ ఎలిషన్ ఖురాన్ పైన ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా గత వారం సాధారణ ఎన్నికలు ఉన్నా లెక్క చేయకుండా డల్లాస్‌లోని హిందూ, ఇండియన్ - అమెరికన్ నేతలను కలుసుకోవడానికి వచ్చిన తులసీ మాట్లాడుతూ తాను భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు.
బాల్యం నుంచే హిందూ సంస్కృతిని ఆచరిస్తూ శాకాహారి మాత్రమే అయిన గబ్బర్డ్ భారత సంతతికి చెందినవారు కారు. ఆమె తండ్రి మైక్ గబ్బర్డ్ కాథలిక్ క్రిస్టియన్. ప్రస్తుతం హవాయి స్టేట్ సెనేటర్‌గా ఉన్నారు. ఆయన అమెరికన్ సమోవాకు చెందినవారు. ఆమె తల్లి కరోల్ పోర్టర్ గబ్బర్డ్ శ్వేత జాతి అమెరికన్ మిచిగాన్ స్టేట్‌కు చెందినవారు. ఆమె హిందూ ఆచారాలను పాటిస్తున్నారు.
ఆ దంపతులు తమ ఐదుగురు పిల్లలను కర్మయోగ విలువ ప్రాధాన్యంతో పెంచారు. సేవాగుణంతో పనిచేయాలని ఉద్బోధించారు. వారి జీవనశైలి కూడా అందుకు అనుగుణంగానే ఉంటుంది. ఆ దంపతులకు పుట్టిన బిడ్డ తులసి. డల్లాస్‌లో తులసి గబ్బర్డ్ హరిహర పీఠంతో పాటు పలు హిందూ దేవాలయాలను సందర్శించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications