యాత్ర: బాబు లేని సమయంలో 5గురు

కమిటీలో పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, దేవేందర్ గౌడ్, దాడి వీరభద్రరావు, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర రెడ్డి ఉన్నారు. రాజకీయ, జిల్లాల వ్యవహారాలు యనమలకు, పార్లమెంటరీ విభాగం, జిల్లా ఇన్‌చార్జులు, ప్రధాన కార్యదర్శులతో సమన్వయం దేవేందర్‌కు, అనుబంధ సంఘాల బాధ్యత పెద్దిరెడ్డికి, మానవ వనరుల విభాగం బాధ్యతలు దాడి వీరభద్రరావుకు, మీడియా సమావేశాల బాధ్యత రావులకు అప్పగించారు.
పాదయాత్ర బాధ్యతలను మరికొందరు నేతలకు అప్పగించారు. పాదయాత్ర మార్గం ఖరారు, పార్టీ నేతలతో సమన్వయం బాధ్యత మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన రావుకు అప్పగించారు. యాత్ర మార్గం పొడవునా ముందస్తుగా పార్టీ నేతలను సన్నద్ధం చేయడం, ఇతర అంశాల పర్యవేక్షణను రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి జనార్దన రావుకు అప్పగించారు. యాత్రలో చంద్రబాబు వెంట ఉండి సమన్వయం చేసుకొనే పనిని ప్రధాన కార్యదర్శి గరికపాటి రామ్మోహనరావుకు ఇచ్చారు.
ఇక, చంద్రబాబు లేని సమయంలో పార్టీ కార్యక్రమాల తీరును పార్టీ కార్యక్రమాల కమిటీ పర్యవేక్షిస్తుంది. గతంలో మీ కోసం యాత్ర సమయంలో కూడా చంద్రబాబు మూడు నెలలు రాజధానిలో అందుబాటులో లేరని, అప్పుడు పార్టీ నేతలకు కొంత అనుభవం వచ్చిందని, అది ఇప్పుడు ఉపయోగపడుతుందని నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications