2014: బాలయ్య జోరు- నారా లోకేష్ బేజారు?

అప్పటి ఎన్నికల సమయంలో టిడిపి ప్రకటించిన నగదు బదలీ పథకం నారా లోకేష్ ఆలోచనే అని ఆ పార్టీ తెలిపింది. ఇటీవల కూడా నారా లోకేష్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. తండ్రి చంద్రబాబు పాదయాత్రలో ఉన్నందున పార్టీ వ్యవహారాలు చూసేందుకు లోకేష్ కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో ఓ కార్యాలయాన్ని కూడా సిద్ధం చేశారట. అక్కడి నుండి పార్టీ వ్యవహారాలు చూసేందుకు ఆయన సిద్ధమయ్యాడట.
అయితే లోకేష్ వ్యూహాలు బెడిసికొడుతుండటంతో బాలయ్య రంగంలోకి దిగారని సాక్షి దిన పత్రిక ప్రచురించింది. నగదు బదలీ, జగన్‌పై విమర్శలు, ఎఫ్‌డిఐ ఓటింగు-హెరిటేజ్ ఫుడ్స్, పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం.. ఇలా లోకేష్ వ్యూహాలు బెడిసికొట్టినట్లుగా రాసింది. లోకేష్ వ్యూహాలు బెడిసికొట్టడం మాట ఎలా ఉన్నా.. బాలయ్య మాత్రం పార్టీపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారట. 2014లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసేందుకు ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందులో భాగంగా ఆయన గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారట.
వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండి ఎవరిని పోటీకి నిలబెడితే బావుంటుంది, ఆశావహులు ఎవరు, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితిలు ఏమిట, ఒక్కో నియోజకవర్గంలో పోటీ కోసం ఆసక్తి చూపిస్తున్న వారు ఎందరున్నారు, ఎవరెవరు ప్రభావం చూపగల్గుతారు.. తదితర వివరాలను బాలయ్య తెప్పించుకుంటున్నారట. మరోవైపు లోకేష్ కూడా తనదైన దారిలో సర్వేలు చేయిస్తున్నరట.












Click it and Unblock the Notifications