వైయస్ జగన్ కోసం బిసి పార్టీ వస్తుందా?

రాబోయే బిసి పార్టీతో పొత్తు కుదుర్చుకుని, ఆ పార్టీకి కొన్ని సీట్లు కేటాయించాలని జగన్ ఆలోచిస్తున్నారట. తద్వారా తాను లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆ పత్రిక రాసింది. జగన్ తన కోసం ఓ బిసి పార్టీని పెట్టిస్తున్నారని తెలంగాణకు చెందిన ఓ సీనియర్ పార్లమెంటు సభ్యుడు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసినట్లు ఆ పత్రిక రాసింది. వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైయస్, కెవిపి రామచందర్ రావు ద్వారా ప్రయోజనం పొందిన బిసి నేతలతో జగన్ రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారని ఆనయ సోనియాకు లేఖలో వివరించారని సమాచారం.
జగన్ వ్యూహాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెసు పార్టీలో బిసిలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆ పార్లెమంటు సభ్యుడు లేఖలో చెప్పినట్లు ఆ తెలుగు దినపత్రిక తెలిపింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిసిలను పట్టించుకోవడం లేదని ఆయన ఆ లేఖలో సోనియాకు ఫిర్యాదు చేశారని ఆ పత్రిక రాసింది.












Click it and Unblock the Notifications