భాను కిరణ్ లిస్ట్‌లోని ప్రముఖులెవరు?

Bhanu Kiran
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ అరెస్టు పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. అదే సమయంలో భాను నోరు విప్పితే ఎవరి పేర్లు బయటకు వస్తాయో అనే చర్చ ప్రధానంగా జరుగుతోంది. శనివారం పోలీసులు తనను మీడియా ముందు ప్రవేశ పెట్టినప్పుడు భాను చిరునవ్వతో కనిపించడం, మొహంలో ఎలాంటి ఆందోళన కనిపించక పోవడం అరెస్టు జరిగిందా లేక లొంగిపోయాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

భాను వైఖరి చూస్తుంటే చాన్నాళ్లపాటు అజ్ఞాతంలో ఉండి విసిగిపోయి లొంగిపోయాడా లేక ఎవరి ఒత్తిళ్లతోనైనా లొంగిపోయాడా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం వాటిని ఖండిస్తూ, అతనిని అరెస్టు చేశామని స్పష్టం చేస్తున్నారు. భాను వెనుక పలువురు ప్రముఖులు ఉన్నారని, వారి ఒత్తిడి వల్లే లొంగిపోయారనే వారూ ఉన్నారు.

ఇప్పుడు భాను అరెస్టు కావడంతో ఆయన నోరు తెరిస్తే ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో అనే అంశం ఆసక్తికరంగా మారింది. భాను తన హవా సాగినంత కాలం పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు చేయడంతో డబ్బుకు కొదువ ఉండేది కాదు. ఖరీదైన కార్లలో తిరిగేవాడు. విచ్చలవిడిగా డబ్బు వెదజల్లేవాడట. అనేకమంది నేతలు, సినీ ప్రముఖులతో భానుకు సంబంధాలు ఉన్నాయనే రూమర్స్ ఉన్నాయి.

ముఖ్యంగా నేతల విషయానికి వస్తే హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి తనయుడితో కలిసి భాను అనేక సెటిల్మెంట్లకు పాల్పడాడనే ఆరోపణలు ఉన్నాయి. విజయవాడలోని అన్నపూర్ణ ప్యాకేజ్‌కు సంబంధించిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. దీనిపై విజయవాడలో కేసు కూడా నమోదైంది. అయితే భానుతో తన తనయుడికి ఎలాంటి లింక్ లేదని సబిత ఖండిస్తున్నారు.

డబ్బు, సినిమా పరిశ్రమతో ఉన్న దగ్గర సంబంధాలను ఉపయోగించుకొని అనేకమంది ఉన్నతాధికారులను కూడా లోబర్చుకున్నాడని, ఆ పరిచయాలతోనే ఎకరాల కొద్ది భూములు సమకూర్చుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. భాను కిరణ్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు ప్రముఖ నిర్మాతలను కూడా సిఐడి పోలీసులు గతంలో విచారించారు.

భానుది అరెస్టు అని పోలీసులు చెబుతున్నప్పటికీ, అతను లొంగిపోవడం వెనుక పలువురు రాయలసీమ నేతల హస్తం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అసలు భానును పోలీసులు శనివారం కాదు అంతకుముందే అదుపులోకి తీసుకొని ఉంటారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే సూరి హత్య కేసులో భాను దొరికినందున నిజాలు నిగ్గు తేల్చాలని గంగుల భానుమతి డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+