సిఎం కిరణ్ వ్యూహం: ఎమ్మెల్యేలకు నిధులు ఎర?

వాస్తవానికి, శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ఎమ్మెల్యేలకు కోటి రూపాయల వరకూ ఖర్చు చేసే అధికారం ఉంది. ఈ మొత్తాన్ని రెండు కోట్లకు పెంచాలని కోరుతున్నారు. దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే శాసన సభ్యులకు ఇచ్చే అభివృద్ధి నిధులతోపాటు సిఎం పర్యటన సమయంలో ప్రజలు, స్థానిక నేతల నుంచి వచ్చే వినతులపై అక్కడికక్కడే హామీలు ఇవ్వాల్సి వస్తుంది. వాటిని నెరవేర్చేందుకు గత ఏడాది రూ.400 కోట్లను కేటాయించారు. ఈ నిధులను ఇప్పటి వరకు పెద్దగా ఖర్చు చేయలేదు. కానీ, మంత్రి వర్గ విస్తరణ తర్వాత అధికార పక్షంలో అసంతృప్తి నెలకొన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు, పదవులు రాక అభివృద్ధి నిధులు మంజూరు కాక, తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేకపోతున్నామని, నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయనే అసహనాన్ని గత రెండున్నరేళ్లుగా పలువురు శాసనసభ్యులు వ్యక్తం చేస్తున్నారు. పలు నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులను మంజూరు చేయడం బుజ్జగించడమే ధ్యేయంగా కావొచ్చునని అంటున్నారు. శనివారం విడుదల చేసిన నిధుల్లో అత్యధికంగా పిఆర్పీ నుంచి వచ్చినవారు, తొలిసారి ఎన్నికైన వారు, జగన్ గూటికి దూరమైన శాసనసభ్యులే ఉండడం విశేషం.












Click it and Unblock the Notifications