కాంగ్రెసు నేతల్లో చంద్రబాబు లేఖ భయం

తెలంగాణపై విన్నవించుకునేందుకు సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ కోసం లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్ర వాదనతో ముందుకు సాగకుంటే తమ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళన తెలంగాణ కాంగ్రెసు నాయకుల్లో అలముకుంది. తెలంగాణ అంశంపై ఏదో ఒకటి తేల్చకుంటే ఈ ప్రాంతంలో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే భయం ఆవహించింది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాస్తే కాంగ్రెసు పార్టీ పూర్తిగా ఆత్మరక్షణలో పడనుంది. కాంగ్రెసు మాత్రమే లక్ష్యంగా మారుతుంది. దీంతో తమ భవిష్యత్తు అంధకార బంధురం అవుతుందనే భయం తెలంగా కాంగ్రెసు నాయకుల్లో అలుముకుంది.
నిజానికి, ఇంతకాలం తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) హవా కొనసాగుతూ వస్తోంది. ఇలాంటి సమయంలో ప్రత్యేక రాష్ట్రానికి సానుకూలంగా తెలుగుదేశం లేఖను అందిస్తే కాంగ్రెస్ కాంగ్రెసు పూర్తిగా దెబ్బ తింటుందనే భయం ఉంది. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటూ ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని భయపడుతున్నారు.
ఇటీవలి యుపిఎసమన్వయ కమిటీ సమావేశంలో కేంద్రమంత్రి శరద్‌పవార్ కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారన్న ప్రచారం నేపథ్యంలో ప్రాంత మంత్రులు, శాసనసభ్యులుగా ప్రత్యేక రాష్ట్ర అంశంపై పోరాడకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్ర అంశంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సోనియాగాంధీని కోరాలని తెలంగాణ మంత్రులు నిర్ణయించారు. ఈ మేరకు మంత్రులు జానారెడ్డి, బస్వరాజు సారయ్య తదితరులు సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ కోరుతూ లేఖ రాశారు.












Click it and Unblock the Notifications