చిరంజీవిపై గుర్రుమంటున్న కాంగ్రెసు సీనియర్లు

ఉప ఎన్నికల పూర్తి బాధ్యతను చిరంజీవికి అప్పగించాలని వారు అధిష్టానానికి సూచిస్తున్నట్లు చెబుతున్నారు. అంటే సాధ్యమైనంత త్వరగా చిరంజీవి మబ్బులను తొలగించుకునే ఉద్దేశంతో ఉండడం వల్లనే వారు అలా అంటున్నారని చెబుతున్నారు. పార్టీ సీనియర్‌నేత కేంద్ర మంత్రి వాయ లార్ రవి రాష్ట్ర పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనలు కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లకు ఆగ్రహం తెప్పించాయి. చిరంజీవి ఇంటికి అల్పాహార విందుకు వెళ్ళిన వా యలార్ రవి అక్కడ చిరంజీవిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు.
చిరంజీవి జాతీయ స్థాయి నాయకుడని, చిరంజీవికి మామూలు బాధ్యతలు అప్పగించబోమని వాయలర్ రవి అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ అమ్ములపొదిలో చిరంజీవి బ్రహ్మాస్త్రమని ప్రకటిం చారు. కేంద్రమంత్రి రవి పొగడ్తలు చిరంజీవిని ఆనందంలో ముంచెత్తాయి. అదే సమయంలో కాంగ్రెసు సీనియర్లకు మంట పుట్టించాయి. కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి, పెరిగి దశాబ్దాల తరబడి పార్టీకి సేవలు చేస్తున్న తమను కాదని నిన్న గాక మొన్న పార్టీలో చేరిన చిరంజీవికి అంత ప్రాధాన్యం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దామోదర్ రెడ్డి తరహాలోనే మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కూడా అగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్లు గాదె వెంకటరెడ్డి, యాదవరెడ్డి, ఆమోస్ తదితరుల మధ్య సీఎల్పీలోనూ చిరంజీవి అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది..
ఉప ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహించిన తిరుపతితో పాటు రాజంపేట, రామచంద్రాపురం, నర్సాపురం నియోజకవర్గాల్లో తాను సూచించిన తన వారికి పార్టీ టిక్కెట్లు ఇ వ్వాలని కోరుతున్న చిరంజీవికి పార్టీ టిక్కెట్లతో పాటు గెలిపించే బాధ్యతను కూడా అప్పగించాలని కాంగ్రెసు సీనియర్లు అంటున్నారు. ఉప బాధ్యతలు అప్పగిస్తేనే చిరంజీవి ఏ స్థాయి నాయకుడో స్పష్టం అవుతుందంటున్నా రు. చిరంజీవి ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications