వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆజాద్ ఎదుట దామోదర టార్గెట్ మళ్లీ సిఎంపైనే?

By Pratap
|
Google Oneindia TeluguNews

Damodara Rajanarasimha
గత సమన్వయ కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేయడం సంచలనమే సృష్టించింది. మరోసారి దామోదర రాజనర్సింహ అదే పని చేయనున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పి. శంకరరావును మంత్రి వర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో శనివారం సాయంత్రం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అధ్యక్షతన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. శంకరరావును బర్తరఫ్ చేయడంపై దామోదర రాజనర్సింహ సమన్వయ కమిటీ సమావేశాన్ని వేడెక్కించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోనో చిరంజీవితోనో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితోనో ఎప్పుడూ కనిపిస్తూ వచ్చిన దామోదర రాజనర్సింహ గత కొద్ది కాలంగా అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తున్నారు.

హోం శాఖ కోసం దామోదర రాజనర్సింహ తీవ్ర ప్రయత్నాలు సాగించినట్లు చెబుతున్నారు. హోం శాఖ నుంచి సబితా ఇంద్రా రెడ్డి నుంచి తప్పించి దామోదర రాజనర్సింహకు అప్పగించేలా చేయడానికే శంకరరావు, ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ కలిసి వ్యూహరచన చేసి అమలు చేసినట్లు చెబుతారు. హోం సబితా ఇంద్రా రెడ్డిని టార్గెట్ చేయడం ఇందులో భాగమేనని అంటారు. ఆ వ్యూహం ఫలించకపోగా, శంకరరావు మంత్రి పదవికే ఎసరు వచ్చింది. దీంతో శంకరరావును వెనకేసుకు రావాల్సిన అవసరం దామోదర రాజనర్సింహకు ఏర్పడిందని చెబుతున్నారు. దీంతో సమన్వయ కమిటీ సమావేశంలో దామోదర రాజనర్సింహ ఆ వ్యవహారంపై తీవ్ర రగడ చేయడానికే సిద్ధపడినట్లు చెబుతున్నారు.

దళితులకు అన్యాయం జరుగుతోందనే వాదనతో దామోదర రాజనర్సింహ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ వివాదాన్ని గులాం నబీ ఆజాద్ ఎలా పరిష్కరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పరస్పరం ఆధిపత్యం కోసం పోరాడుతున్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శంకరరావు విషయంలో మాత్రం ఒక్కటయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామం కాంగ్రెసులో ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.

English summary
It is said that Deputy CM Damodara Rajanarasimha may target CM Kiran kumar Reddy in party coordination committee meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X