జైపాల్ రెడ్డితో ఫైట్: కిరణ్ రెడ్డికి తెలగాణ సెగ

అయితే, తెలంగాణ కు చెందిన మంత్రులు గానీ, మిగిలిన ఎమ్మెల్యేలు గానీ బాహాటంగా ఒక్కరు కూ డా మద్దతు ప్రకటించడం లేదు. పైగా, కిరణ్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఒక్క తాటిపైకి రావడం పార్టీవర్గాల్లో ఆసక్తికరంగా మారిందిచ్చారు. జైపాల్‌రెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కావడం వల్లనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారని, గ్యాస్ గురించి మాట్లాడుతున్న కిరణ్, తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు అనేకం ఉన్నప్పటికీ, దానిపై ఎందుకు కేంద్రంతో మాట్లాడ టం లేదని ఎంపీల కన్వీనర్ పొన్నం ప్రభాకర్ నిలదీ స్తున్నారు.
ముఖ్యమంత్రి లేఖను లీక్ చేయటం మంచిది కాదని, గ్యాస్ కోసం జైపాల్ చాలా కష్టపడ్డార ని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందని సీనియర్ పార్లమెంటు సభ్యుడు వి.హనుమంతరావు సైతం వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న సీనియర్ మంత్రి కుందూరు జానారెడ్డి కూడా జైపాల్‌కు అనుకూలంగా మాట్లాడారు. జైపాల్‌రెడ్డి వల్లే 11 నెలల పాటు, మన రాష్ట్రానికి గ్యాస్ వ చ్చిందని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అభిప్రాయానికి భిన్నంగా వాదించారు.
ఎమ్మెల్సీ యాదవరెడ్డి కూడా కిరణ్‌కు వ్యతిరేకంగానే మాట్లాడి, జైపాల్‌ను సమర్థించారు. మాజీ మంత్రి శంకర్‌రావు కూడా ముఖ్యమంత్రిని తూర్పారపట్టి, జైపాల్‌కు దన్నుగా నిలిచారు. మంత్రి శ్రీధర్‌బాబు దీనిపై వ్యాఖ్యానించినప్పటికీ కర్ర విరగకుండా పాము చావకుండా వ్యవహరించారు. ముఖ్యమంత్రి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో పాటు, జైపాల్ రెడ్డిని వ్యతిరేకిస్తుండటంతో వ్యతిరేకత ద్విగుణీకృతమవుతోంది.
సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు పురంధేశ్వరి, పల్లంరాజు, పనబాక లక్ష్మి రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పరిరక్షిస్తున్నారని ముఖ్యమంత్రి జైపాల్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారని తెలంగాణ ఎంపీలు విరుచుకుపడుతున్నారు. గతంలో వైఎస్ రాజశే ఖరరెడ్డిపై సొంత పార్టీతో పాటు, విపక్షాలు విమర్శలు చేసినా వెంటనే స్పందించి, ఎదురుదాడి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్‌రెడ్డి విష యంలో మాత్రం మౌనం వహించి, తమకెందుకు అన్నట్లు మౌనం వహిస్తున్నారు.
తెలంగాణ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడుతుంటే సీమాంధ్ర మంత్రులు కూడా ఎవరూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి అనుకూలంగా మాట్లాడటం లేదు. ముందు చూపుతోనే వారు మౌనపాత్ర వహిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జైపాల్ రెడ్డితో పెట్టుకుని కొరివితో తల గోక్కున్నారనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications