జగన్ కేసులో రేపు ఛార్జీషీట్: అరెస్ట్‌లపై సస్పెన్స్?

ఈ కేసులో జగన్‌తోపాటు 72 మంది వ్యక్తులు, సంస్థలు, గుర్తు తెలియని అధికారులు, ప్రజా ప్రతినిధుల పేరిట గత ఏడాది ఆగస్టు 17న సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా అనేకమంది ఐఏఎస్ అధికారుల్ని, జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వ్యాపారవేత్తలు, బ్యాంకు ప్రతినిధులను సిబిఐ విచారించింది. తొలిసారిగా రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకట రమణను కూడా సిబిఐ అధికారులు తమ కార్యాలయానికి పిలిపించి విచారించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జారీ అయిన వివాదాస్పద జీవోల వల్ల లబ్ధిపొందిన వ్యక్తులు, సంస్థల వివరాలను సిబిఐ సేకరించినట్లుగా తెలుస్తోంది. అందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లోకి ప్రవహించిన పెట్టుబడుల పైనా ఆరా తీసింది.
జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, సండూర్ పవర్, కార్మెల్ ఏసియా తదితర సంస్థల్లో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు? అవి ఎక్కడి నుంచి ఎలా వచ్చాయి? వంటి విషయాలపై సిబిఐ ఇప్పటికే అనేక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇక, ఈ కేసులో తదుపరి అరెస్టుల విషయంలో అనేక పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ, మేళ్లు, పెట్టుబడుల కోణంలో విచారణ సాగిన నేపథ్యంలో కొందరు కీలక వ్యక్తుల్ని సిబిఐ అరెస్టు చేయవచ్చని అంటున్నారు. దీనికి సంబంధించి పలువురు వ్యక్తుల నుంచి రికార్డు చేసిన వాంగ్మూలాల ఆధారంగానే మరిన్ని అరెస్టులు ఉండవచ్చుననే ప్రచారం నేపథ్యంలో దీనిపై సస్పెన్స్ నెలకొంది.












Click it and Unblock the Notifications