జూనియర్ ఎన్టీఆర్‌ది రాజీయా, వ్యూహమా?

Jr Ntr
హైదరాబాద్: నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో రాజీకి సిద్ధపడ్డారా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. బాబాయ్ బాలకృష్ణ పోటీ చేస్తే తాను ప్రచారం చేస్తానని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఇటీవల ప్రకటించి, ఎన్టీఆర్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ స్థితిలో ఎత్తగడలేమిటో అర్ధం కావడం లేదని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.

2009 ఎన్నికల్లో టిడిపికి తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ప్రయాణంలో ప్రమాదం జరగడంతో ప్రచారం విరమించారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు జూనియర్ దూరంగానే ఉంటున్నారు. చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించిన సమయంలో, పాదయాత్ర కొనసాగుతున్నప్పుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా పాలు పంచుకున్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం యాత్రకు దూరంగానే ఉంటున్నారు. అక్టోబర్ రెండవ తేదీన బాబు పాదయాత్ర ప్రారంభం అయింది.

అప్పటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ బాద్షా సినిమా షూటింగ్‌లో ఉన్నానని, ఆ సినిమా షూటింగ్ ముగిసిన తరువాత వస్తానని చెబుతున్నారు. హైదరాబాద్ శివారులోని శంకర్‌పల్లిలో బాబు యాత్ర సాగుతున్నప్పుడు సైతం జూనియర్ రాలేదు. జూబ్లీ హిల్స్ నుంచి అరగంటలో వెళ్లడానికి అవకాశం ఉన్న ప్రాంతానికి సైతం జూనియర్ వెళ్లలేదు. కేవలం సినిమా షూటింగ్ వల్లనే వెళ్లలేకపోయాడంటే నమ్మలేకుండా ఉందని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.

గతంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న చంద్రబాబు భార్య భువనేశ్వరి సైతం పాదయాత్ర ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పలుసార్లు యాత్రలో పాల్గొన్నారు. కర్నూలులో బాలకృష్ణ, మహబూబ్‌నగర్‌లో జూనియర్ ఎన్టీఆర్ బాబుపాదయాత్రలో పాల్గొంటారని తొలుత టిడిపి నాయకులు తెలిపారు. అయితే బాలకృష్ణ యాత్రలో పాల్గొన్నారు.కానీ మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలు దాటి ఇప్పుడు బాబు యాత్ర నిజామాబాద్‌లోకి ప్రవేశించే సమయంలో కూడా జూనియర్ హాజరు కాలేదు.

నందమూరి హరికృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన ఇతర సభ్యులు సైతం యాత్రలో పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, 2009 ఎన్నికల్లో సైతం అతను అంత సులభంగా ప్రచారానికి రాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. 2008లో జరిగిన యువగర్జనలో బాలకృష్ణ పాల్గొనగా జూనియర్ మాత్రం దూరంగానే ఉన్నారు. జూనియర్‌కు అత్యంత సన్నిహితుడైన నాని తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి జూనియర్‌పై తెలుగుదేశంనాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో జూనియర్ సినిమాకు వ్యతిరేకంగా కొందరు తెలుగు యువత నాయకులు ప్రచారం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులంతా పార్టీకి అండగా నిలిచినప్పుడు జూనియర్ సైతం పార్టీకి అండగా నిలిస్తేసే బాగుంటుందని టిడిపి నాయకులు చెబుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయదలుచుకున్నారనేది మాత్రం అంతుపట్టడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+