Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మమత సైలెన్స్ వెనుక..: దాదాకు గ్రీన్ సిగ్నలా?

Mamatha Banergee
మాజీ కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వంపై తొలుత రాద్దాంతం చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. యుపిఏ కూటమిలో భాగస్వామి అయిన మమతా బెనర్జీ తమ సొంత రాష్ట్రానికి చెందిన ప్రణబ్ అభ్యర్థిత్వాన్ని రాష్ట్రపతిగా వ్యతిరేకించారు. ఇదే విషయాన్ని కాంగ్రెసుకు తెలియజేశారు.

ప్రణబ్‌ను పోటీకి నిలపవద్దని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తదితరులను ఆమె కాంగ్రెసుకు సూచించారు. అయితే కాంగ్రెసు నుండి ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రణబే యుపిఏ అభ్యర్థి అని తేల్చి చెప్పడంతో ఓ సమయంలో మమత యుపిఏకు రాం రాం చెప్పనున్నారనే ప్రచారం కూడా జరిగింది. అందుకోసం కేంద్రంలోని తమ పార్టీ మంత్రుల వద్ద రాజీనామాలు కూడా తీసుకున్నారనే వార్తలు వినిపించాయి. ప్రణబ్‌కు ధీటుగా అబ్దుల్ కలాంను ఆమె తెర పైకి తీసుకు వచ్చారు.

అయితే కలాం సున్నితంగా తోసిపుచ్చడంతో అప్పుడే ఆమె పరిస్థితి గందరగోళంలో పడింది. ఇప్పుడు ఆమె ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకోలేని పరిస్థితులో ఉందని చెబుతున్నారు. తొలుత హడావుడి సృష్టించిన మమత ఇప్పుడు మౌనంగా ఉండటం వెనుక ఏమీ తేల్చుకోలేకనే అనే వాదనలు వినిపిస్తున్నాయి. తాను వ్యతిరేకించిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మమత మినహా యుపిఏ పక్షాలన్నీ ఆయనకు మద్దతిస్తున్నాయి. ఎన్డీయేలోని జెడి(యు), శివసేన వంటి పార్టీల మద్దతు కూడా ఉంది. ఇంకా కొన్ని పార్టీలు మద్దతిచ్చే అవకాశముంది. ఇక మరో అభ్యర్థి పిఏ సంగ్మా.. ప్రణబ్ దాదాకు దరిదాపుల్లో కూడా లేరు. సంగ్మా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆ అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితులలో సంగ్మాకు మద్దతిచ్చి రాష్ట్రానికి చెందిన ప్రణబ్‌ను వ్యతిరేకించిన విమర్శలను మమత పశ్చిమ బెంగాల్‌లో ఎదుర్కొంటారనడంలో ఎలాంటి సందేహాలు లేవు.

ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో ప్రతిపక్షంగా ఉన్న, కాంగ్రెసును వ్యతిరేకిస్తున్న పలు వామపక్షాలు సైతం ప్రణబ్ దాదాకు మద్దతిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులల్లో తమ పార్టీ ఒక్కటే ప్రణబ్‌ను వ్యతిరేకించడం వల్ల లాభం లేదనే పునరాలోచనలో మమత ఉండి ఉండవచ్చునని అంటున్నారు. అందుకే ఆమె ఇప్పుడు ఎవరికీ కనిపించకుండా ఉండిపోయారని అంటున్నారు. ఇప్పటికే హిట్లర్‌లా పాలిస్తోందన్న వాదనల నేపథ్యంలో ఓడిపోయే సంగ్మాకు మద్దతిచ్చి రాష్ట్రానికి చెందిన ప్రణబ్‌ను కాదంటే బెంగాల్‌లో ఆమె విమర్శలకు గురవుతారు. మమత సైలెన్స్ వెనుక ప్రణబ్‌కు మద్దతిచ్చి యుపిఏకు అండగా ఉండాలనే నిర్ణయమే కారణం కావచ్చని అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+