ఎన్టీఆర్ 9 సెంటిమెంట్: బాబుకు కలిసొస్తొందా?

చంద్రబాబు పాదయాత్ర సోమవారంనాటికి వేయి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. చంద్రబాబు యాత్ర చేపట్టి 63 రోజులు అవుతోంది. ఆరు, మూడు కలిపితే 9 సంఖ్య వస్తుంది. అదే విధంగా సోమవారంనాటి తేదీ 3.12.12. ఈ మూడింటిని కూడితే కూడా 9 వస్తోంది. పైగా, చంద్రబాబు వయస్సు 63 ఏళ్లు. ఇదీ 9 సంఖ్యను తెచ్చిపెడుతోంది. చంద్రబాబు పాదయాత్ర చేపట్టిన వేయి కిలోమీటర్లు పూర్తన్న సమయంలో 9 అదృష్ట సంఖ్య కలిసి వచ్చిందని, ఇది శుభసూచకరమని వారు అంటున్నారు.
అదృష్ట సంఖ్య మాట ఎలా ఉన్నా, చంద్రబాబు మాత్రం ప్రజల విశ్వాసాన్ని పొందడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తన వ్యక్తిత్వాన్ని కూడా మార్చుకున్నారు. గతంలో మాదిరిగా అధికార దర్పాన్ని ప్రదర్శించడం లేదు. ప్రజల మధ్య కూర్చుకుంటున్నారు. వారి చేతులకు మైక్ ఇచ్చి వారు చెప్పింది వింటున్నారు. పైగా, తన మ్యానరిజాన్ని మార్చుకున్నారు. తనకు తిరుగులేదనే విధంగా హావభావాలను ప్రదర్శించే చంద్రబాబులో సౌమ్యం కనిపిస్తోంది.
గతంలో చంద్రబాబు రెండు వేళ్లు చూపించి విజయం గుర్తుతో చేయి వూపేవారు. దానికి ఆయన పూర్తిగా స్వస్తి చెప్పారు. పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి రెండు చేతులూ జోడించి ప్రజలకు నమస్కారం పెడుతున్నారు. ప్రజలు చెప్పే వాటిని సహనంతో వింటున్నారు. నిజానికి, చంద్రబాబుకు
అనారోగ్యం ఆమడ దూరంలో ఉండేది.
ఇప్పుడు ఆయనను షుగర్ వ్యాధి పీడిస్తోంది. గతంలో ఆయన ఈ సమస్య లేదు. ఒత్తిడి, అలసట కారణంగా అది తాకిందని అంటున్నారు. దాంతో ఆయన మందులు వాడాల్సి వస్తోంది. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తున్నా పట్టించుకోకుండా ఆయన నడక సాగిస్తున్నారు. తాడోపేడో తేల్చుకునే ఉద్దేశంతోనే ఆయన సర్వం ఒడ్డుతున్నట్లు కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications