Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వృత్తిలో సాఫ్ట్‌వేర్ బెస్ట్, జర్నలిజం చెత్త!

Software Engineers have the best job in the world
ఏ వృత్తి బెటర్ అంటే సాఫ్టువేర్ వృత్తియే అని అందరూ ముక్తకంఠంతో చెబుతారు. అమెరికాలోని కెరీర్ కాస్ట్ కన్సల్టెన్సీ సంస్థ ఏ వృత్తి ఉత్తమమైనది అనే అంశంపై సర్వే చేసింది. ఈ సర్వేలో అందరూ అనుకున్నట్టే సాఫ్టువేర్ వృత్తి మొదటి స్థానంలో నిలిచింది. అయితే మొదటి పది వృత్తులలో జర్నలిజం ఉండటం విశేషం. 2012 సంవత్సరానికి గాను సాఫ్టువేర్ ఇంజనీర్ వృత్తి అత్యుత్తమమైన ఉద్యోగమని కెరీర్ కాస్ట్ వెల్లడించింది.

మొత్తం రెండు వందల ఉద్యోగాలపై ఆ సంస్థ సర్వే చేసింది. ఐదు ప్రాథమిక అంశాల ఆధారంగా వృత్తి గొప్పతనాన్ని గుర్తించినట్లు సదరు సంస్థ తెలిపింది. శారీరక శ్రమ, పని వాతావరణం, ఆదాయం, ఒత్తిడి, అవకాశాలను పరిశీలించినట్లు పేర్కొంది. అమెరికాలోని అన్ని ఉద్యోగాలను అధ్యయనం చేశామని పేర్కొంది. కార్మిక శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి గణాంకాలను సేకరించిన అనంతరం జాబితాను రూపొందించినట్లు పేర్కొంది.

ఉత్తమ ఉద్యోగాలలో సాఫ్టువేర్ ఉద్యోగానికి మొదటి స్థానం దక్కింది. ఆ తర్వాత స్థానాల్లో బీమా గణకుడు, మానవ వనరుల మేనేజర్, దంత వైద్యుడు, ఆర్థిక ప్రణాళిక నిపుణులు నిలిచారు. వీరు ఏటా ముప్పై లక్షల రూపాయల నుండి యాభై లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారట. ఇక చెత్త వృత్తుల జాబితాలో కట్టెలు కొట్టే పనికి మొదటి స్థానం దక్కగా ఆ తర్వాత పాడి పరిశ్రమలో పని చేసే రైతు, సైనికుడు, చమురు కార్మికుడు, విలేకరు పనులు నిలిచాయి.

వెయిటర్లు, మీటర్ నమోదుదారుడు, పాత్రలు, కడిగేవారు, మాంసం అమ్మేవారు, ప్రసారకర్తలు పలువురు ఈ జాబితాలో ఉన్నారు. విలేకరి ఉద్యోగం చెత్త వృత్తిలోకి చేరిన కారణాలు ఆ సంస్థ వివరించింది. ప్రస్తుతం డిజిటల్ సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని, సమాచారం క్షణాల్లో ప్రజలకు చేరువవుతోందని, దీంతో పత్రికల ప్రాధాన్యం తగ్గిపోతందని, ఒకప్పుడు విలేకరి వృత్తికి మంచి ప్రాధాన్యం ఉండేదని, ప్రస్తుతం వృత్తి పరమైన ఒత్తిళ్లు ఎక్కువవడం, అవకాశాలు తగ్గడం, ఆదాయం అంతంత మాత్రమే ఉండడంతో అది చెత్త వృత్తుల జాబితాలోకి చేరిందని పేర్కొంది.

ఇక అత్యంత ఒత్తిడితో కూడుకున్న పనుల జాబితాలో సైనికుడు, అగ్నిమాపక సిబ్బంది, విమాన చోదకుడు, మిలటరీ జనరల్, పోలీసు అధికారు, కార్యక్రమ సమన్వయ కర్త, పౌర సంబంధ అధికారి, ఫోటో జర్నలిస్టు, టాక్సీ డ్రైవర్ తదితరులు ఉన్నారు. ఇవి అత్యంత ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు అని తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+