వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పించుకునేందుకు 'జార్జియా'పై సాయిరెడ్డి కన్ను!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijaya Sai Reddy
గత సంవత్సరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలపై కేసులు పెట్టగానే అరెస్టుల నుండి తప్పించుకునేందుకు జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి రకరకాల ఎత్తులు వేశారని, అందులో భాగంగా జార్జియా దౌత్యవేత్త హోదాపై కన్నేసినట్లు ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించిందని, ఆంధ్రజ్యోతి పత్రిక కథనం రాసింది. కథనం ప్రకారం... విజయ సాయిరెడ్డి అరెస్టుల నుండి తప్పించుకోవడానికి తన హోదాను అంతర్జాతీయ స్థాయికి పెంచుకోవాలని భావించారు. ఆయన ఆశించిన హోదా ఏమిటంటే, 'విజయ సాయిరెడ్డి, జార్జియా దేశపు గౌరవ కాన్సుల్ జనరల్, హైదరాబాద్'! విదేశీ గౌరవ కాన్సుల్ జనరల్ అంటే దౌత్యవేత్త హోదా లభిస్తుంది. దౌత్యవేత్తలకు సహజంగానే అరెస్టులు, కస్టడీల నుంచి తగిన రక్షణ లభిస్తుంది.

అందుకే సాయిరెడ్డి ఈ ఇంటర్నేషనల్ ఐడియా! విదేశాల్లో తమ దేశ అధికారులను మాత్రమే దౌత్యవేత్తలుగా నియమిస్తారు. కానీ గౌరవ దౌత్యవేత్తలు తమ సొంత అధికారులు కానక్కర్లేదు. స్థానికంగా తమ ప్రయోజనాలను మరింత కాపాడుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వాలతో దగ్గరి సంబంధాలు నడిపేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను గౌరవ కాన్సుల్ జనరల్‌గా నియమించడం రివాజు. ఇదేదో తనకు పనికొచ్చే వ్యవహారంగా సాయిరెడ్డికి అనిపించింది. అంతే దౌత్యవేత్త అవతారం ఎత్తేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇందుకు జార్జియాను ఎంచుకున్నారు. జార్జియాలో తనకున్న లింకుల ద్వారా సాయిరెడ్డి చక్రం తిప్పారు. సాయిరెడ్డిని హైదరాబాద్‌లో మా దేశ గౌరవ కాన్సులర్‌గా నియమించాలని అనుకుంటున్నాం, మీ అభిప్రాయం చెప్పండని భారత విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది.

దానిని ఢిల్లీ అధికారులు హైదరాబాదుకు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ కోరారు. ఇక్కడి అధికారులు సిబిఐని సంప్రదించారు. అరెస్టులు, కస్టడీలు తప్పించుకునేందుకే సాయిరెడ్డి ఇలాంటి ఎత్తులు వేస్తున్నట్లు గ్రహించిన సిబిఐ ససేమీరా అంది. దీంతో భారత విదేశాంగ శాఖ కూడా ప్రతికూల నివేదిక పంపింది. దీంతో సాయిరెడ్డికి దౌతవేత్త హోదా చేజారిపోయింది. అంతేకాదు అరెస్టుల నుండి తప్పించుకునేందుకు విజయ సాయి దేశంలో ఓ ఉన్నత స్థాయి పోస్టుకు కూడా గాలెం వేసినట్లు తెలుస్తోందని రాసింది. ఏకంగా భారత రిజర్వు బ్యాంకులోనే పాగా వేయాలని ఆయన పథకం పన్నారని, ఆర్‌బిఐ డైరెక్టర్ పదవి కోసం ప్రయత్నించాడని, అయితే సిబిఐ అడ్డుకోవడంతో కథ అడ్డం తిరిగిందని రాసింది.

English summary
Leading telugu news paper wrote that Jagathi Publications vice chairman Vijaya Sai Reddy tried to escape from arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X