సిఎల్పీలో మాయం కానున్న వైయస్ ఫోటో

ఇటీవల తెలంగాణలో జరిగిన ఆరు అసెంబ్లీ, కోస్తాంధ్రలో జరిగిన ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నికల్లో వైయస్ ప్రస్తావన తీసుకురాలేదన్న విషయాన్ని పలువురు నేతలు గుర్తు చేస్తున్నారట. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని కొనసాగించే దిశలో ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. సిఎంగా కొణిజేటి రోశయ్య బాధ్యతలు నిర్వహించిన సమయంలోనూ సిఎల్పీ కార్యాలయంలో రాజశేఖర రెడ్డి ఫొటోను ముద్రించారు.
కిరణ్ కుమార్ రెడ్డి సిఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనూ వైయస్ ఫొటో అదే స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, రాష్ట్రంలో కొద్దికాలంగా జరుగుతున్న పరిణామాలు, సిబిఐ విచారణ తదితర కారణాలతో వైయస్‌ను సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలన్న అభిప్రాయం పార్టీ నేతల్లో కనిపిస్తోంది.
ఇందులో భాగంగా త్వరలోనే సిఎల్పీ కార్యాలయంలోని మీడియా సమావేశ భవనంలో ఉన్న వైయస్ బ్యాక్ డ్రాప్‌ను పూర్తిగా మార్చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట. రెండు, మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకునే అవకాశముందని వారు చెబుతున్నారు. దీంతో సిఎల్పీ మీడియా హాల్‌లో వైయస్ ఫొటో కనుమరుగయ్యే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications