లెఫ్ట్ అండ్ రైట్: మమతా ఫెడరల్‌తో బాబు గేమ్?

దీనిపై చంద్రబాబు గురువారం మాట్లాడాతూ... ఎన్డీయే, యూపియేతర ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయం కేంద్రంలో ఒకటే ఫ్రంట్ ఉంటుందని, అది థర్డ్ ఫ్రంట్ కావొచ్చు లేదా ఫెడరల్ ఫ్రంట్ కావొచ్చునని చెప్పారు. చంద్రబాబు దీదీ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌ను స్వాగతించారు. తద్వారా 2014 ఎన్నికల తర్వాత ఏ ఫ్రంట్ వస్తే ఆ ఫ్రంట్‌లో చేరేందుకు తాము సిద్ధమని చెప్పకనే చెప్పారని అంటున్నారు.
బాబు ప్రకటన కొన్ని థర్డ్ ఫ్రంట్ ప్రాంతీయ పార్టీల అధినేతలకు అసంతృప్తిని కలిగించి ఉండవచ్చు. చంద్రబాబు రాష్ట్రంలో కమ్యూనిస్టులతో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి సిపిఎం టిడిపితో కలిసి వస్తుందో రాదో తెలియనప్పటికీ, సిపిఐ మాత్రం సిద్ధంగా ఉంది. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం ప్రధానంగా ఉన్నప్పటికీ లెఫ్ట్ పార్టీలు మమతా బెనర్జీ ఫ్రంట్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు.
మరోవైపు థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికలలో ప్రధానమంత్రి కావాలని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ భావిస్తున్నారు. ఆయన ఫెడరల్‌కు అనుకూలంగా ఉండరు. థర్డ్ ఫ్రంట్ ఆశల పల్లకిలో ఉన్న ములాయం ప్రధానంగా దక్షిణాది నుండి చంద్రబాబు మద్దతుపై ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో బాబు ఫెడరల్‌ను ఆహ్వానించడం ములాయంకు కూడా రుచించకపోయి ఉండవచ్చునని అంటున్నారు.
నిన్నటి వరకు యూపిఏ, ఎన్డీయేతర ప్రభుత్వాలకు థర్డ్ ఫ్రంటే ప్రత్యామ్నాయం అని భావించినప్పటికీ, ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అంటూ మమతా బెనర్జీ చెప్పడం, దానిని చంద్రబాబు మద్దతు ఆహ్వానించడం చూస్తుంటే థర్డ్ ఫ్రంట్ వీకయినట్లుగానే కనిపిస్తోందని అంటున్నారు. పైగా ఫెడరల్ ఫ్రంట్‌కు ప్రస్తుతానికి అనూహ్య మద్దతు వస్తోంది. గతంలో థర్డ్ ఫ్రంట్‌కు చంద్రబాబు కన్వీనర్‌గా ఉండటం గమనార్హం.












Click it and Unblock the Notifications
