దిగ్విజయ్‌తో నాదెండ్ల భేటీ: తెలంగాణ తీర్మానంపైనే..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియలో శాసన సభ తీర్మానం ఒక మలుపు లాంటిది. తీర్మానాన్ని చర్చకు చేపట్టే సమయంలో స్పీకర్ అత్యంత మెలుకువతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. 2009 డిసెంబర్ 9న అప్పటి హోం శాఖ మంత్రి పి చిదంబరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించటంతోపాటు దీనికోసం రాష్ట్ర శాసన సభ ఒక తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను అదేశించినట్లు చెప్పటం తెలిసిందే.
అప్పట్లో రాష్ట్ర శాసన సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే తీర్మానం చర్చకు రాకముందే తెలుగుదేశం, కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన సీమాంధ్ర శాసన సభ్యులు రాజీనామా చేయటం, ఆ తరువాత పెద్ద ఎత్తున గొడవ జరగటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి శాసన సభలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తీర్మానాన్ని ప్రతిపాదించి చర్చించటం గొడవతో కూడుకున్న విషయం అనేది అందరికి తెలిసిందే. అందుకే బుధవారం దిగ్విజయ్‌తో నాదెండ్ల జరిపిన చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర శాసన సభలో పార్టీల బలాబలాల గురించి కూడా వారు చర్చించి ఉంటారని భావిస్తున్నారు.
ఆరు సూత్రాల పథకాన్ని ఎత్తివేస్తేనే...
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే మొదట ఆరు సూత్రాల పథకాన్ని ఎత్తి వేసేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుందని అంటున్నారు. రాజ్యాంగంలోని 371 డి ప్రకారం ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధలను ఆరు సూత్రాల పథకం పేరుతో జారీ చేయటం తెలిసిందే. 1969 తెలంగాణ ఉద్యమం తరువాత ఈ ఆరు సూత్రాల పథకాన్ని జారీ చేస్తూ దీనికోసం రాజ్యాంగాన్ని సవరించారు. లోక్‌సభలో రాజ్యాంగ సవరణకు మూడింటా రెండు వంతుల మెజారిటీ అవసరమవుతుంది.
రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ వారం, పది రోజుల క్రితం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడారని అంటున్నారు. యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం వద్ద మూడింటా రెండు వంతుల మెజారిటీ లేదు కాబట్టి లోక్‌సభలో రాజ్యాంగ సవరణ సాధ్యం కాదు కాబట్టి రాష్ట్ర విభజన జరగదని సీమాంధ్ర నాయకులు వాదిస్తున్నారు.












Click it and Unblock the Notifications