హోం రేసులో గులాం నబీ ఆజాద్!?

షిండేకి ఇటీవలే ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఊపిరితిత్తులకు సంబంధించి ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. అయితే, షిండే జబ్బు గురించి కానీ, ఆపరేషన్ గురించి కానీ వివరాలు చెప్పేందుకు డాక్టర్లు నిరాకరించారు. శస్త్ర చికిత్స తర్వాత కూడా షిండే పూర్తిగా కోలుకోవడం లేదని, అస్వస్థత మూలంగా విధులకు హాజరు కాలేకపోతున్నారని తెలియడంతో అత్యంత కీలకమైన హోంశాఖను ఎలా నిర్వహించగలరన్న ఆందోళన కాంగ్రెస్ అధిష్ఠానానికి ఏర్పడ్డట్లు తెలిసింది.
ఏదో విధంగా పార్లమెంట్ సమావేశాలను గట్టెక్కించి, హోంశాఖను పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్‌కు కానీ, ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్‌కు కానీ అప్పజెప్పే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.
తెలంగాణకు సంబంధించి కేంద్ర కేబినెట్ నోట్‌ను తయారు చేసే బాధ్యత కూడా షిండే భుజస్కంధాలపై ఉన్న విషయం తెలిసిందే. దీంతో, అస్వస్థత నేపథ్యంలో షిండేకు తేలికపాటి శాఖను కానీ, ఏ పోర్ట్‌ఫోలియో లేని మంత్రిత్వ శాఖను కానీ అప్పగించే అవకాశాలున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications