జూ. ఎన్టీఆర్ ఔట్: నారా లోకేష్ యువసేన (పిక్చర్స్)
హైదరాబాద్: హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగానే వెనక్కి నెట్టినట్లు భావిస్తున్నారు. తనకు ఆహ్వానం అందకపోవడంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ మహానాడుకు హాజరు కాలేదు. చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ మాత్రం హంగామా చేశారు. నారా లోకేష్‌ను ముందుకు తేవడానికి వ్యూహాత్మకంగానే జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు మహానాడుకు ఆహ్వానించలేదనే మాట వినిపిస్తోంది.
ఆహ్వనం అందకపోయినా నందమూరి హీరో తారకరత్న మాత్రం మహానాడుకు హాజరయ్యారు. తమ తాత ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ కాబట్టి మహానాడుకు రావడానికి ఆహ్వానం అక్కరలేదని, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని ఆయన అన్నారు. కానీ, పరిస్థితి ఆ రకంగా కనిపించలేదు. ఆ విషయాన్ని అలా వుంచితే మహానాడులో యువనేతల హంగామా దండిగానే కనిపించింది. వారంతా సీనియర్ నేతల కుమారులో, కుటుంబ సభ్యులో కావడం విశేషం. నారా లోకేష్‌కు చంద్రబాబు ఓ యువ బృందాన్ని అప్పగిస్తున్నట్లే వ్యవహారం కనిపించింది.
మహానాడులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయనతో పాటు సీనియర్ నేతల తనయులు కూడా ఈ వేడుకలో ఆకర్షణగా నిలిచారు. పరిటాల శ్రీరామ్, రామ్మోహన నాయుడు, చింతకాయల విజయ్, దేవినేని చంద్రశేఖర్, రితేష్ రాథోడ్, కరణం వెంకటేష్, సిద్దార్థ రెడ్డి, వీరేంద్ర గౌడ్, రాజారామ్ యాదవ్ వంటి యువకులు మహానాడులో పాల్గొన్నారు. యువ నేతలంతా ఒకే గ్యాలరీలో హంగామా చేశారు. ఇదంతా నారా లోకేష్ ప్రయత్నంలో భాగమే అంటున్నారు.

తనకు ఆహ్వానం అందకపోవడంతో తెలుగుదేశం పార్టీ మహానాడుకు హాజరు కాలేదని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగానే ఆయనను ఆహ్వానించలేదని అంటున్నారు. తన కుమారుడు నారా లోకేష్‌కు పోటీ లేకుండా చేయడానికి జూనియర్ ఎన్టీఆర్‌ను దూరం పెట్టారనే మాట వినిపిస్తోంది.

టిడిపి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ మహానాడు తన ప్రసంగంతో అదరగొట్టాడు. ఆయనకు మహానాడులో ప్రాధాన్యం ఇచ్చారు.

పరిటాల రవి, శానససభ్యురాలు పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ తెలుగుదేశం పార్టీలో యువనేతగా ముందుకు వస్తున్నారు.

నందమూరి హీరో తారకరత్న తాను చంద్రబాబు నాయుడివైపు ఉండడానికి నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. ఆహ్వానం అందకపోయినా మహానాడు రావడం బాధ్యత అని ఆయన జూనియర్ ఎన్టీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.

మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎటు ఉండాలో ఇంకా తేల్చుకోనట్లు అర్థమవుతోంది. ఆయన ఇరు పక్షాల మధ్య సంధి కుదర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో తన తండ్రి తర్వాతి స్థానాన్ని ఆక్రమించడానికి ముందుకు వస్తున్నట్లే కనిపించారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆయన యువనేతలతో కలిసి హంగామా చేశారు.












Click it and Unblock the Notifications