ఫ్లెక్సీ రగడ: బాబుకు జూ ఎన్టీఆర్ బల ప్రదర్శన?

Chandrababu Naidu - Jr Ntr
రెండు రోజుల క్రితం ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ విజయవాడలో చేసిన హంగామా అంతా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తన సత్తా చూపించేందుకేనా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు తన బలం, బలగాన్ని చూపించేందుకే జూనియర్ ఎన్టీఆర్ దుకాణ ప్రారంభోత్సవాన్ని వినియోగించుకున్నారని అంటున్నారు. సాధారణంగా ఏవైనా ఓపెనింగ్స్ కోసం వచ్చినప్పుడు హీరోలు పెద్ద హంగామా చేయరని కానీ, జూనియర్ మాత్రం అందుకు భిన్నంగా చేశారంటున్నారు.

బాబుపై అసంతృప్తితో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా చూపించేందుకు దీనిని వినియోగించుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు పాదయాత్ర కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు టిడిపి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ వర్గానికి చెందిన కార్యకర్తలో బాబు, జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య, లోకేష్ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారట. అప్పటి వరకు బాబు పాదయాత్రలో ఎక్కడా జూనియర్ ఫోటోలు కనిపించడం లేదట.

కానీ, వంశీ వర్గం జూనియర్ ఫోటోను ఫ్లెక్సీలో జొప్పించడం బాబుకు నచ్చలేదట. ఇందుకు క్లాస్ కూడా తీసుకున్నారట. ఇదే మరోసారి ఆ కుటుంబంలో విభేదాలకు దారి తీసిందంటున్నారు. ప్లెక్సీ విషయం జూనియర్‌కు తెలిసిందని, దీంతో తన బలం చూపించేందుకు జూనియర్ దుకాణ ప్రారంభోత్సవాన్ని వేదికగా చేసుకున్నారని అంటున్నారు. ఫ్లెక్సీలో తన ఫోటోపై అభ్యంతరం వ్యక్తం చేసిన బాబుపై ఖచ్చితంగా ఇది జూనియర్ బల ప్రదర్శనే అంటున్నారు.

చంద్రబాబు పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుండి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు పాల్గొనలేదు. ఒకటి రెండుసార్లు బయటకు వచ్చిన జూనియర్ సమయం వచ్చినప్పుడు తాను పాదయాత్రలో పాల్గొంటానని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు ఆయన యాత్రలో పాల్గొనలేదు. అదే సమయంలో విజయవాడ ఫ్లెక్సీ చిచ్చు రాజుకుంది. దీంతో ఇక బాబు పాదయాత్రలో జూనియర్ కనిపించక పోవచ్చునని అంటున్నారు. బయటకు కనిపించకపోయినా ఇరు వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+