వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ రెడ్డికి 'సహకారం', 'స్థానికం'తో ’14 టార్గెట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్‌: తాజా డిసిసిబి, డిసిఎంఎస్ ఎన్నికల్లో కాంగ్రెసు తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించిన ఘనత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికే దక్కుతుంది. ఈ సహకార ఎన్నికల విజయం ఆయనలో ధీమాను పెంచిందని, దానివల్ల ఆయన బలోపేతమయ్యారని అంటున్నారు. ఈ విజయం అందించిన స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లి, వాటిలో సత్తా చాటాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా 2014 ఎన్నికలకు మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలనే వ్యూహంతో ఆయన ఉన్నారు.

తాజాగా జరిగిన డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రెండు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాలోనూ విజయదుందుభి మోగించడం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ఠ పెరిగింది. అధిష్ఠానం దృష్టిలో సమర్థనేతగా అవతరించేందుకు ఒక వేదికగా మారింది. దానికితోడు, చాలా కాలం నుంచి ‘సొంత చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్‌ను గెలిపించలేని ముఖ్యమంత్రి' అన్న ముద్ర పడిన కిరణ్‌, సొంత జిల్లాలో సత్తా చాటారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దూకుడుకు ముందునుంచే కళ్లెం వేశారు. సాంకేతిక అంశాలను అస్త్రంగా సంధించి పెద్దిరెడ్డి వర్గాన్ని దెబ్బతీశారు. లేకపోతే సొంత జిల్లాను గత రెండు ఎన్నికల మాదిరిగా వైయస్సార్ కాంగ్రెస్‌కు మరోసారి ధారాదత్తం చేయవలసి వచ్చేది.

డీసీసీబీ చైర్మన్‌గా తన అభ్యర్ధిని గెలిపించిన ఆయన, డీసీఎంఎస్‌ను పెద్దిరెడ్డి వర్గం-జగన్‌ పార్టీకి వెళ్లకుండా నిరోధించడంలోనూ విజయం సాధించారు. ఆ పదవిని తెలుగుదేశం పార్టీ సాధించింది. ఎమ్మెల్సీ, తిరుపతి ఉప ఎన్నికల్లో ఘోరపరా జయం పాలైన నేపథ్యంలో ఈ పరిణామం కిరణ్‌ రెడ్డికి సొంత జిల్లాలో పట్టు పెరిగిందన్న సంకేతాలు పంపించింది. సహకార ఎన్నికలు ముగిసిన రోజునే పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మూడు నెలల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

దాంతో ముఖ్యమంత్రి ఆ మూడు నెలలూ తీరిక లేకుండా రాజకీయాలు చేసే అవకాశం ఉంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్నుతూ జిల్లా నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో మంతనాలతోనే కాలం గడిచిపోతుంది. ఇక ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు. అది జరిగిన తర్వాత మునిసిపల్‌ ఎన్నికలు ఉండనే ఉన్నాయి. ఈలోగా నీటి సంఘాల ఎన్నికలు రానున్నాయి. అంటే మరో ఏడెనిమిది నెలల వరకూ ముఖ్యమంత్రి రాష్ట్రంలో జరిగే వివిధ ఎన్నికలపైనే సీరియస్‌గా దృష్టి సారించనున్నారు. ఈ సమయంలో నాయకత్వ మార్పు అసంభవమని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

కీలకమైన స్థానికల ఎన్నికలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రిని మార్చే అవకాశం ఉండదని, ఇక ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరేడు నెలలే సమయం ఉన్నందున ఆ సమయంలో మార్చే ప్రయోగం పార్టీ అధిష్టానం చేయబోదని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తానికి కిరణ్‌ కుమార్ రెడ్డికి తాజా పరిణామాలు కలిసి వస్తున్నాయి.

English summary
he Panchayat Raj and municipal polls, which now seem to be a certainty with the Supreme Court clearing the decks, will be a curtain-raiser for the general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X