వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫొటోలు: పొలిటికల్ పార్టీలకు స్టార్ ఇమేజ్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో రాజకీయాలు స్టార్ ఇమేజ్ తళుక్కమనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీల్లోనూ తారలు తమ ప్రజాకర్షణను పరీక్షకు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. కాంగ్రెసు పార్టీ సహా తెలంగాణ రాష్ట్ర సమితి వరకు అన్ని పార్టీల్లోనూ ప్రధానమైన నటీనటులు ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. కాంగ్రెసు పార్టీకి చిరంజీవి మెగా ఆకర్షణ కానున్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు వస్తే కాంగ్రెసు పార్టీ తారల తళుకులతో మెరిసిపోయే అవకాశం ఉంది.

ఇక, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి సినీరంగానికి దగ్గరగా ఉంటూ వస్తోంది. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ద్వారా తెలుగుదేశం పార్టీలోకి చాలా మంది తారలు పార్టీలోకి వచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విస్తృతంగా ప్రచారం చేస్తారు. ఆయన ఎన్నికల్లో పోటీ కూడా చేయనున్నారు. ఆయన గుడివాడ శానససభా నియోజకవర్గంపై దృష్టి పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. మురళీమోహన్, కవిత వంటి గత తరం యాక్టర్లు కూడా ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారబరిలోకి దిగితే ప్రజలకు ఎన్నికల్లో బోలెడు కనువిందు, వీనుల విందూ..

ఫొటోలు: పొలిటికల్ పార్టీలకు స్టార్ ఇమేజ్

కాంగ్రెసు పార్టీకి సినీ రంగంలోకి ఒక వర్గం వచ్చే ఎన్నికల్లో మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు సినీ రంగంలోని ఓ పాయ కాంగ్రెసు వైపు ఉంటుందనే ప్రచారం సాగుతోంది. చిరంజీవి కుటుంబ సభ్యులు ప్రచార బరిలోకి దిగితే చెప్పాల్సిందేమీ లేదు, కాంగ్రెసు తారాతోరణంతో తళుక్కున మెరుస్తుంది.

ఫొటోలు: పొలిటికల్ పార్టీలకు స్టార్ ఇమేజ్

రాజశేఖర్, జీవిత దంపతులు కూడా కాంగ్రెసు తరఫున నిలిచే అవకాశాలున్నాయి. వారు ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి హైదరాబాద్ బాంబు పేలుళ్ల సహాయార్థం చెక్కు ఇచ్చారు.

ఫొటోలు: పొలిటికల్ పార్టీలకు స్టార్ ఇమేజ్

తెలుగుదేశం పార్టీకి ప్రధాన ఆకర్షణ ఎన్టీ రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ. జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ కూడా తోడైతే సినీ రంగంలోని ఓ వర్గం అంతా చిరంజీవి వర్గానికి దీటుగా నిలిచే అవకాశాలున్నాయి.

ఫొటోలు: పొలిటికల్ పార్టీలకు స్టార్ ఇమేజ్

వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో రోజా దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది. హీరోయిన్లలో రోజాకు ప్రజాకర్షణ మెండుగానే ఉంది.

ఫొటోలు: పొలిటికల్ పార్టీలకు స్టార్ ఇమేజ్

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి విజయశాంతి ప్రచారం చేసే అవకాశాలున్నాయి. తెలంగాణ రాములమ్మగా పేరు గాంచిన ఆమెకు ప్రజాకర్షణ చాలా ఉంది.

ఫొటోలు: పొలిటికల్ పార్టీలకు స్టార్ ఇమేజ్

రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించిన దాసరి నారాయణ రావు ఈ ఎన్నికల్లో తన పాత్ర నిర్వహిస్తారా, లేదా అనేది అనుమానంగానే ఉంది. ఆయన రాజకీయాల పట్ల వైరాగ్యం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. ఒకవేళ రంగంలోకి దిగితే ఏ పార్టీ తరఫున అనేది తేలాల్సి ఉంది.

ఫొటోలు: పొలిటికల్ పార్టీలకు స్టార్ ఇమేజ్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తన ఉనికిని చాటుతూ వచ్చిన జయప్రద రాజమండ్రి లోకసభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఆమె ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనేది తేలాల్సి ఉంది.

ఫొటోలు: పొలిటికల్ పార్టీలకు స్టార్ ఇమేజ్

మోహన్ బాబు కూడా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారనే ప్రచారం సాగుతోంది. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ప్రచార హోరును అదరగొట్టడానికి సినీ నటి రోజా సిద్ధంగా ఉన్నారు. పూరీ జగన్నాథ్ వంటి దర్శకులు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి లేడీ బాస్ విజయశాంతి అసెట్ కానున్నారు. ఆమెకు హీరోలకు ఉన్నంత ఇమేజ్ ప్రజల్లో ఉంది. రాజశేఖర్, జీవిత దంపతులు ఎటు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. వారు చిరంజీవితో విభేదిస్తూ వచ్చారు. కానీ, ఇటీవల వారు రాజీ ధోరణికి వచ్చినట్లు చెబుతున్నారు. కాంగ్రెసు పార్టీలో కొనసాగాలని వారు అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

English summary
Coming 2014 election will be very interesting with the cine stars compaign. Every party, including Congress habe their own set of cine actors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X