పాదయాత్రల ఫీవర్: ఢిల్లీలో గుసగుస (పిక్చర్స్)
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రల పైన ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో పాటు రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ నుండి రాహుల్ వారి పాదయాత్రలపై ఆరా తీశారట.
వారి పాదయాత్ర వల్ల ఆ పార్టీలకు ఏ మేరకు లాభం, కాంగ్రెసుకు ఏమైనా నష్టం చేకూరుతుందా? తదితర విషయాలపై వారిని అడిగి తెలుసుకున్నారట. వారి పాదయాత్రలతో కాంగ్రెసుకు, ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారట! ప్రధాన ప్రతిపక్షం టిడిపిలో కుటుంబంలో విభేదాలు ఉన్నాయని, ఆ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు కుటుంబంలో విభేదాలు ఇటీవల వరుసగా బయటకు వస్తున్నాయని రాహుల్‌కు చెప్పారట.
ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి ఇది నష్టపర్చే అంశమని, అంతేకాకుండా కార్యకర్తల్లో కూడా ఉత్సాహం తగ్గుతుందని చెప్పారట. షర్మిల పాదయాత్ర కారణంగా కూడా ఆ పార్టీకి ఒరిగేదేమీ లేదని చెప్పారట. ఇన్నాళ్లు వైయస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ వారికి పనికి వచ్చిందని, క్రమంగా ఇప్పుడు ఆ సెంటిమెంట్ తగ్గుతోందని వివరణ ఇచ్చారట. అందుకు పలు సర్వేలను కూడా ఉదాహరణగా చూపారట.
అదే సమయంలో కాంగ్రెసు క్రమంగా పుంజుకుంటోందని, వివిధ పథకాలు ప్రవేశ పెడుతూ ప్రజల్లోకి వెళ్తున్నామని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు అందరికంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంటుందని రాహుల్‌కు కిరణ్ చెప్పారని సమాచారం. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక, ఇతర వర్గాలకు పథకాల ద్వారా కాంగ్రెసు ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఏర్పడుతుందని చెప్పారని తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిందిగా రాహుల్‌ను కిరణ్ కోరారు. కర్నాటక ఎన్నికల తర్వాత రాష్ట్రానికి వస్తానని రాహుల్ చెప్పినట్లుగా సమాచారం. రాహుల్ గాంధీ మాత్రమే కాకుండా రాష్ట్రానికి చెందిన ఇతర నేతల నుండి కూడా పలువురు ఢిల్లీ పెద్దలు ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికల ముందు కావడంతో బాబు, షర్మిల పాదయాత్రలపై ఢిల్లీలో జోరుగా చర్చ సాగుతోందట.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర తర్వాత పార్టీ పరిస్థితిలో మార్పు వచ్చింది.

అక్టోబర్ 18న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల పాదయాత్ర ప్రారంభించారు.

వీరి పాదయాత్రల పైన కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణల నుండి రాహుల్ గాంధీ ఆరా తీశారు. పాదయాత్రల ప్రభావం ఎలా ఉందని ఆయన కూపీ లాగారు.

బాబు పాదయాత్ర వల్ల ఒరిగేదేమీ లేదని, అంతేకాకుండా ఎన్టీఆర్ కుటుంబంలో విభేదాలు పొడసూపాయని అవి ఆ పార్టీకి నష్టమేనని రాహుల్‌కు కిరణ్ చెప్పారట. ఇటీవల కటౌట్ల వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

షర్మిల పాదయాత్ర వల్ల కూడా ఆ పార్టీకి ఒరిగేదేమీ లేదని, 'వైయస్' సెంటిమెంట్ క్రమంగా తగ్గుతోందని 'ముఖ్య' నేతలు రాహుల్‌కు చెప్పారట.












Click it and Unblock the Notifications