ఆ'జాదూ': వారిద్దరి చెట్టాపట్టాల్, రాహుల్ అనాసక్తి

అయితే, ఇందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ వేసిన మంత్రం పని చేసిందట. బొత్స ఢిల్లీ చేరుకున్న వెంటనే ఆజాద్‌ను కలిసి గంటసేపు మాట్లాడారు. మీరిద్దరూ కలిసికట్టుగా ఉంటేనే రాహుల్‌ను సంతృప్తి పర్చగల్గుతారని, ఏమైనా తేడాలు కనిపిస్తే ఆయన ఇద్దర్నీ సాగనంపవచ్చునని హెచ్చరించారట. ఈ హెచ్చరిక సంకేతాల తర్వాతనే వారిద్దరు క్లోజ్‌గా మూవయ్యారట.
సాధారణంగా ముఖ్యమంత్రి, బొత్స ఇద్దరూ ఢిల్లీలో ఉంటే దూరం దూరంగా ఉంటారు. ఈసారి మాత్రం కిరణ్‌తో బొత్స రెండు గంటలకుపైగా మంతనాలు జరిపారు. మధ్యాహ్నం భోజనానంతరం మళ్లీ కలుసుకుని, సాయంత్రం మళ్లీ ఆజాద్ సమక్షంలో కలిసి రాత్రి పొద్దు పోయేవరకూ మాట్లాడుకుని వెళ్లడం పలువురి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా ఒకరి పదవిపై మరొకరు పూర్తి భరోసాగా మాట్లాడారు.
తనను తొలగించాలని ముఖ్యమంత్రి అనుకోవడం లేదని, ఇద్దరం కలిసే పని చేస్తున్నామని బొత్స చెప్పారు. మరోవైపు బొత్స పదవికి ఏం ఢోకా లేదని, మరో వ్యక్తి పిసిసి అధ్యక్షుడిగా వస్తే ఆయనతో కలిసి పనిచేయడం సిఎంకు కష్టమవుతుందని సిఎం క్యాంప్ వర్గం చెప్పిందట. ఇక రాహుల్ ముందుకు కలిసికట్టుగా వెళ్లిన కిరణ్, బొత్స అత్యంత సన్నిహితంగా మెలిగారు. నిన్నటి వరకు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకొని ఫిర్యాదులు చేసుకున్న వారు చెట్టాపట్టాల్ వేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపర్చిందట.
అయితే రాహుల్ గాంధీ మాత్రం అంత సంతృప్తి చెందలేదట. అయితే, ఎన్నికల్లో గెలుపొందాలంటే కిరణ్, బొత్సలు ఇలా ఉంటేనే బాగుంటుందని, వారు అప్పటి వరకు అలా ఉండగలరా? అని నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. గతంలోను వారిద్దరిని కలిసి ఉన్నట్లుగా కనిపించాలని ఢిల్లీ పెద్దలు సూచించినట్లుగా వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications