విభజన: వెనక్కి తగ్గుతున్న సీమాంధ్ర ఎంపీలు

న్యూఢిల్లీ: పార్టీ అధిష్టానం పెడుతున్న ఒత్తిడితో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు వెనక్కి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను తన దారికి తెచ్చుకునే విషయంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులతో, కేంద్ర మంత్రులతో విడివిడిగా చర్చలు జరిపి నచ్చజెప్పే ప్రయత్నాలు సాగిస్తోంది.

సీమాంధ్ర పార్లమెంటు సభ్యులతో అధిష్టానం పెద్దలు విడివిడిగా చర్చలు జరుపుతూ వారిని దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధవారంనాడు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు కొంత మంది పార్లమెంటు సభ్యులతో విడివిడిగా మాట్లాడారు. మంగళవారం గాంధీ విగ్రహం ముందు రాష్ట్ర నేతలతో కలిసి ధర్నా చేసిన లగడపాటి రాజగోపాల్, సాయి ప్రతాప్, కనుమూరి బాపిరాజు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, హర్షకుమార్, అనంత వెంకట్రామిరెడ్డి బుధవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్‌లోకి దూసుకెళ్లలేదు. కూర్చుండి నిరసన వ్యక్తం చేశారు.

Seemandhra leaders yielding to the pressure

ఆ తర్వాత వారిలో కొందరు సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ నుంచి అనుమతి తీసుకుని తమ నియోజకవర్గాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిపోయారు. తిరిగి పార్లమెంటుకు సోమవారం రావచ్చునని కమల్ నాథ్ వారికి సూచించారు. కాగా, ఆహార భద్రత బిల్లుపై ఓటింగ్‌లో పాల్గొనకూడదని, విప్‌ను ధిక్కరించాలని హర్షకుమార్ నివాసంలో జరిగిన సమావేశంలో ఒక ఎంపీ సూచించినప్పటికీ మిగతా సభ్యులు అందుకు నిరాకరించారు.

సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు బుధవారం సాయంత్రం ఆంటోనీ కమిటీని కలవాల్సి ఉంది. అయితే, తాము తర్వాత వస్తామని సీమాంధ్ర ఎంపీలు తెలియజేశారు. దీంతో తెలంగాణ ప్రాంత ఎంపీలు ఆంటోనీ కమిటీతో బేటీ అయ్యారు. గురువారంనాడు సీమాంధ్ర ఎంపీలు ఆంటోనీ కమిటీతో సమావేశమయ్యే అవకాశం ఉంది.

దానికితోడు, సీమాంధ్ర ఎంపీల పట్ల కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చురకలు అంటించడం ఇందులో భాగమేనని అంటున్నారు. లగడపాటి రాజగోపాల్ ఎంపీ మాత్రమేనని, సిడబ్ల్యుసి కన్నా పెద్దవాడు కాదని ఆయన వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి సీమాంధ్ర ఎంపీలను నయానా భయానా దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెసు అధిష్టానం ప్రయత్నాలు సాగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+